Bigg Boss 5 Telugu: ఆ బ్యూటీకి డబుల్ షాక్: లవ్ ట్రాక్‌కు బ్రేక్..ఈ వారం అవుట్

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..అయిదో వారంలోకి ఎంట్రీ అయింది. ఎలిమినేషన్‌ డే వచ్చేసింది. మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌‌గా మారింది. ఇప్పటిదాకా వరుసగా మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. మేల్ కంటెస్టెంట్ నాలుగో ఎలిమినేటర్‌గా నిలిచాడు. ఈ ట్రెండ్‌కు కొనసాగుతుందా? లేక.. బ్రేక్ పడుతుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

 ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. వీక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు రాలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో నేచురల్‌గా ఉండలేకపోయారని, ఈ రియాలిటీ షోలో ఆర్టిఫీషియల్‌గా కనిపించారనేది కారణాలుగా చెబుతున్నారు నెటిజన్లు. ఈ వారం అలాంటి కంటెస్టెంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్‌ల లిస్ట్‌లో చేరబోయే ఎలిమినేటర్ ఎవరో తెలిసిపోయింది.

ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది ఎవరు?

అయిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 15 మందిలో సగం మందికి పైగా అంటే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయ్యారు. నటి ప్రియ, హమీదా ఎలిమినేషన్ రిస్క్‌లోకి వెళ్లారు. వారితోపాటు షణ్ముఖ్ జశ్వంత్, విశ్వ, యాంకర్ రవి, లోబో, వీజే సన్ని, మానస్ నాగులపల్లి, జెస్సీ ఈ వారం నామినేట్ అయ్యారు. మొత్తం తొమ్మిదిమంది ఈ సారి నామినేట్ అయ్యారు.

సేఫ్ జోన్‌లో ఎవరు?

తొమ్మిది మంది నామినేట్ అయిన కంటెస్టెంట్లలో టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఓటింగ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. అతనికి హయ్యెస్ట్ ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుతానికి అతనే టాపర్‌గా నిలిచాడు. 44.60 శాతం అంటే 14,906 ఓట్లు పడ్డాయి అతనికి. రెండో స్థానంలో సన్నీ నిలిచాడు. అతనికి 18.29 శాతం.. అంటే 6,114 ఓట్లు పోల్ అయ్యాయి. 8.76 శాతం ఓట్లతో మానస్ నాగులపల్లి మూడో స్థానంలో ఉన్నాడు. అతనికి పడ్డ ఓట్లు 2,926. మానస్ తరువాత నాలుగో స్థానంలో యాంకర్ రవి నిలిచాడు. అతనికి 2,400 ఓట్లు పడ్డాయి. ప్రియ-2,077, జెస్సీ-1,678, లోబో-1,405 మేర ఓట్లను సాధించారు.

డేంజర్ జోన్‌లో వారిద్దరూ..

ఇక హమీదా, విశ్వ చిట్ట చివరి స్థానాల్లో నిలిచారు. హమీదాకు 2.99 శాతం మాత్రమే ఓట్ల పోల్ అయ్యాయి. వెయ్యి కంటే తక్కువకే అంటే 998 ఓట్లు పడ్డాయి. ఆమె కంటే తక్కువ ఓట్లు విశ్వకు పోల్ అయ్యాయి. అతనికి వచ్చిన ఓట్ల శాతం 2.74 అంటే 916. హమీదా, విశ్వ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటోంది. ఇద్దరి మధ్య ఉన్న ఓట్ల శాతం తక్కువే. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఈ వారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడానికి అవకాశాలు ఉన్నట్టేనని నెటిజన్లు అంచనా వేస్తోన్నారు. వీకెండ్ వచ్చే సమయానికి హమీదా కంటే విశ్వకు అధికంగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.

హమీదా అవుట్..

ఈ నేపథ్యంలో హమీదా.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ నడిపిస్తుండటం, టాస్క్ మీద కాన్సన్‌ట్రేట్ చేయకపోవడం వంటి కారణాలను చెబుతున్నారు నెటిజన్లు. అక్కినేని నాగార్జున ఇచ్చిన కింగ్ అండ్ స్లేవ్ ఛాయిస్‌లోనూ హమీదాకు నెగెటివ్ రిమార్క్స్ పడ్డాయి. ఈ వారం 14 మందే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టు తనకు అనిపించిందని షణ్ముఖ్ జశ్వంత్ ముఖం మీదే చెప్పేశాడు. ఆమె ఎప్పుడూ శ్రీరామచంద్ర వెంటే ఉంటోందని, తనదైన శైలిలో టాస్కుల్లో ఆడట్లేదని తేల్చి చెప్పాడు. తోటి కంటెస్టెంట్లే ఆమెపై నెగెటివ్ కామెంట్స్ సైతం చేశారంటే.. ఇక వీక్షకుల అభిప్రాయం ఎలా ఉంటుందో చెప్పుకోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది.

బిగ్‌బాస్ టైటిలే ముఖ్యం..

శనివారం నాటి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున అడిగిన ప్రశ్నకు శ్రీరామచంద్ర నుంచి వచ్చిన సమాధానం కూడా హమీదాకు డైజెస్ట్ కాలేకపోవచ్చు. బిగ్‌బాస్ టైటిల్ ముఖ్యమా? హమీదా ముఖ్యమా? అంటూ నాగార్జున అడగ్గా.. తాను టైటిల్ కోసమే బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చానని, ఆ తరువాతే ఇంకెవరైనా అంటూ సమాధానం ఇచ్చాడు శ్రీరామచంద్ర. రెండోసారి కూడా నాగార్జున అదే ప్రశ్నను సంధించినా.. బిగ్‌బాస్ టైటిల్ తన టార్గెట్ అంటూ శ్రీరామచంద్ర తేల్చేశాడు. శ్రీరామచంద్ర ఇచ్చిన షాక్‌కు ఎలిమినేషన్ రూపంలో బిగ్ బాస్ ఇంకో షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+