హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం లాక్‌డౌనో ఏమో..? బిర్యానీ ధరకు రెక్కలు... డబుల్ రేటవడంతో గుండె గుబేల్

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాదీ బిర్యానీ అని చెబితే చాలు నోరు ఊరిపోతుంది. భాగ్యనగరంలో గల్లీ గల్లీలో వెరైటీ బిర్యానీ లభిస్తోంది. ఊరు/ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు హైదరాబాద్ బిర్యానీ తినందే వెళ్లరు. అందుకే ఇక్కడ బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక లాక్‌డౌన్ వల్ల బిర్యానీకి మరింత గిరాకీ పెరిగింది. మ‌ధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండ‌డంతో చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుని లాగించేస్తున్నారు.

బిర్యానీ ధరకు రెక్కలు

బిర్యానీ ధరకు రెక్కలు


లాక్ డౌన్ పేరుతో బిర్యానీ ధరలకు రెక్కలొచ్చాయి. రెస్టారెంట్లు అధికంగా బిర్యానీ ధరల్ని పెంచేశారు. ట్యాక్సులు..డెలివరీ చార్జీలు అంటూ బిర్యానీల బిల్లులు పెంచేస్తున్నారు. దీంతో బిర్యానీ తినాలనే కోరికతో ఆర్డర్ చేసుకుంటే వచ్చిన భిల్లు చూస్తే మాత్రం గుండెలు గుబేల్ మంటోంది. కొత్త‌గా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్‌ ఛార్జీల పేరుతో వ‌సూళ్ల‌ు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రూ.265 నుంచి..

రూ.265 నుంచి..


హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తికి హోటల్‌కు వెళ్లి బిర్యానీ తినటం అలవాటు. బిర్యానీ అంటే అంత ఇష్టం మరి. దానికి బిల్లు రూ.265 చెల్లించేవాడు లాక్ డౌన్ లేని సమయంలో. కానీ లాక్ డౌన్ తో హోటల్ కెళ్లి తిని ఇంటికి వచ్చేసరికి లాక్ డౌన్ సమయం దాటిపోతుంది. దీంతో రిస్క్ ఎందుకులే అని ఆర్డ్ చేసినమరీ తెప్పించుకున్నాడు. గతంతో రూ.265 ఉన్న మటన్ బిర్యానీ ధర ఒక్కసారిగా దాదాపు డబుల్ అయిపోయింది.

రూ.405..

రూ.405..


లాక్ డౌన్ వల్ల హోటల్ కు వెళ్లికుండా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేయాలనుకున్నాడు. రూ.405గా రేటు చూపించింది. బిర్యానీ డెలివరీకి అద‌నంగా మరో రూ.22, ఇత‌ర‌ ఛార్జీల కింద రూ.40. మొత్తం బిల్లు రూ.467 క‌ట్టాల్సి వ‌చ్చింది. రెస్టారెంట్ (ప్యాకేజ్ చార్జీలు, జీఎస్టీలు, డెలివరీ చార్జీలు) మొత్తం అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు. కేవలం బిర్యానీకి మాత్రమే కాదు ఏ ఇత‌ర ఆహార ప‌దార్థాలకు కూడా ప్యాకేజింగ్‌ ఛార్జీలు, పన్నులు అంటూ వ‌సూళ్ల మీద వసూళ్లు చేసి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు.

అడ్డగోలుగా దోపిడీ

అడ్డగోలుగా దోపిడీ


అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం రూపొందించ‌లేదు. దీంతో హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఇలా దోపిడీకి పాల్ప‌డుతున్నది. ఇలాంటి వసూళ్లకు సంబంధించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు కూడా చేయవచ్చు. బిల్లులు అధికంగా వేస్తే క‌స్ట‌మ‌ర్లు వెంట‌నే వినియోగదారుల మండలి లేదంటే తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
biryani rate hike with lock down effect in hyderabad. one biryani is rs.405 in the city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X