అత్తాపూర్‌లో దారుణం.. ఇంట్లో వివాహిత... భర్తపైనే అనుమానం...?
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అత్తాపూర్ రాంబాగ్‌లో ఓ వివాహిత హత్యకు గురైంది. ఆమెను ఎవరు హత్య చేశారు..? ఎందుకు చంపారు అనే అంశాలపై స్పష్టత రాలేదు. భూతగాదా విషయంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు. త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు చెప్తున్నారు.

భార్య, భర్త.. ఫ్యామిలీ
రాంబాగ్‌లో తన కుటుంబంతో జ్యోతి అనే గృహిణి ఉంటున్నారు. జ్యోతికి భర్త ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. వీరి కాపురంలో ఎలాంటి చీకు, చింత లేదు. కానీ సడెన్‌గా జ్యోతి విగతజీవిగా మారడంతో ఏం జరిగిందనే అంశం చర్చకు దారితీసింది. ప్రస్తుతానికైతే జ్యోతి హత్య విచారణ జరగుతుందని.. ఎవరు హతమర్చారనే అంశంపై త్వరలోనే క్లారిటీ వస్తోందని పోలీసులు చెప్తున్నారు.

కారణమిదేనా..?
ఆర్థిక లావాదేవీల్లో బెడిసికొట్టడంతో హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. జ్యోతిని హతమార్చిన తర్వాత ఆమెను ఇంట్లోని వదిలేసి దుండగులు వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి నిందితుడు పరారవడంతో అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి గురించి తెలిసిన వారే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ల్యాండ్ ఇష్యూ..?
ఇటీవల భూ తగాదా ఒక్కటి తెరమీదకొచ్చిందని స్థానికులు తెలిపారు. ఆ భూమి కోసం హత్య జరిగి ఉంటుందా అనే అనుమానిస్తున్నారు. అయితే ఆమెను ఎవరు మట్టుబెట్టారు ? దాంతో ఎవరికి ప్రయోజనం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబసభ్యుల హస్తంతోనే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో అన్నీ విషయాలు వెలుగుచూస్తాయని చెప్తున్నారు.

విషాద వదనం..
మరోవైపు భర్తే హత్య చేసి ఉంటాడని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇంట్లో భార్యను చంపేసి.. పరారయ్యాడా ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా మృతురాలి స్వస్థలం కర్ణాటక కావడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లి కూడా విచారిస్తామని పోలీసులు చెప్తున్నారు. నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ తన ఇంట్లోనే వివాహిత విగతజీవిగా మారడం స్థానికులను కలచివేస్తోంది. తమతో సరదాగా ఉండే జ్యోతి ఇకలేదని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు.
-
పండుగల వేళ TGSRTC భారీ షాక్, ఛార్జీల పెంపు - ఇక ఇలా ..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications