దేశద్రోహం కేసు పెడతాం.. కేసీఆర్‌కు రాం చందర్ రావు వార్నింగ్
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత రాం చందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఇటీవల ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను చర్చించేందుకు ఇవాళ బీజేపీ లీగల్‌సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్‌పై రాంచందర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని చెప్పారు. కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువరు బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

దేశ రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని ఆయన చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసనలో పాల్గొంటే ఆందోళనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మోడీని, నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా అవమానించేలా కేసీఆర్ మాట్లాడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాని కామెంట్ చేశారని విరుచుకుపడ్డారు. అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని చెప్పారు.
Recommended Video
రాజ్యాంగం గురించి కేసీఆర్ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. దళితులు రగిలిపోతున్నారు. ఇదేంటి అని విరుచుకుపడ్డారు. రోజుకో చోట దిష్టిబొమ్మలు దగ్దం చేస్తూ.. నిరసనలు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలు.. కాంగ్రెస్, బీజేపీ కూడా పోరుబాట పట్టాయి. కామెంట్స్ తీరు కాదని మండిపడ్డాయి. వెంటనే తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగా బీజేపీ న్యాయ పోరాటానికి సిద్దమయ్యింది. మోడీ, నిర్మలమ్మతో పాటు.. రాజ్యాంగం వ్యాఖ్యలను కూడా జోడిస్తున్నాయి. కేసులు పెడతామని బెదిరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications