కేసీఆర్ సోయి ఉండటం లేదా..? రాములమ్మ విజయశాంతి నిప్పులు
సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కలవడానికి 7 సంవత్సరాలుగా సీఎంకు సమయం దొరకలేదా అని అడిగారు. ఆత్మహత్యలు చేసుకున్న వేలాది రైతుల, నిరుద్యోగుల కుటుంబాలను చూడడానికి ఒక్క రోజుకూడా దొరకదని మండిపడ్డారు. ఏవో రెండు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నానని చెబుతూ నెలకు రెండు సార్లు వెళ్ళిన చోటికే మళ్లీ మళ్లీ పర్యటనలు చేస్తూ, ఆ ఊర్లకే మొత్తం అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నారని అన్నారు.
ఇలా ఎందుకోసం చేస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలియడం లేదని చురకలు అంటించారు. కేసీఆర్ జ్ఞాపకశక్తి కోల్పోయి, చేసిన పర్యటనలే మళ్లీ, మళ్లీ చేస్తున్నారా?.. అని అడిగారు. లేదంటే హుజురాబాద్ ఎన్నికల దృష్ట్యా గత హామీలను అమలు చేస్తానని చూపడానికి, కొత్త మోసాల హామీలతో ఓటర్లను బోల్తా కొట్టించడానికి ఈ కార్యక్రమం నడుపుతున్నారా? అని విజయశాంతి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఇవాళ కేసీఆర్ వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అందుకోసమే విజయశాంతి ఫైరయ్యారు. బై పోల్ ఉంటేనే ప్రజలు, సమస్యలు గుర్తుకు వస్తాయా అని అడిగారు. లేదంటే మరచిపోతారా అని దుయ్యబట్టారు.
వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేశారు. తర్వాత గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం గ్రామాన్ని సందర్శించారు. ఇంతకుముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ అనివార్య కారణాల వద్ద వాయిదా పడింది. ఈ సారి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.
Recommended Video
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నిక పూర్తయితే ఎవరూ పట్టించుకోరు అని అంటున్నారు. ఇదివరకటి పథకాలు.. దళితుడు సీఎం నినాదాలు ఏమయ్యాయని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అదేం లేదని అంటోంది. తాము సంక్షేమ పథకానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications