వరదలొస్తే ఎక్కడున్నారు.. కాపలా కుక్కలా ఉంటానన్న కామెంట్ గుర్తుచేసిన రఘునందన్ రావు
గ్రేటర్‌లో ప్రచారం జోరందుకుంది. బీజేపీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. వీరికి రఘునందన్ రావు కూడా తోడయ్యారు. వీరంతా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ఆయన నాచారం డివిజన్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.

కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ప్రకటిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్ రావు అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు సేవలు చేయడం లేదని.. కానీ ఎప్పుడూ ఫామ్ హౌస్ లో ఉంటారని చెప్పారు. అలాంటి కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిధులివ్వకుంటే రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలన్నారు. ఎన్నికల టికెట్లను టీఆర్ఎస్ పార్టీ అమ్ముకుంటుందని ఆరోపించారు.
Recommended Video
అంతేకాదు తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. మరీ హైదరాబాద్ లో వరద వచ్చి జనం అవస్థలు పడుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు ఒక్కటేనని చెప్పారు. ఇందులో దేనికి ఓటు వేసినా ఒక్కటేనని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని స్పష్టంచేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications