కేసీఆర్ అంటేనే వంచన.. ఎవరినీ వదల్లేదు, బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శలు
గ్రేటర్ ప్రచారం జోరందుకుంది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా వీరి విమర్శలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని అర్వింద్ విమర్శించారు. అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ఆయన బుధవారం ఆల్విన్ కాలనీలో రోడ్ షో నిర్వహించారు.
కేసీఆర్ అందరినీ మోసం చేశారని అర్వింద్ ధ్వజమెత్తారు. అందరికంటే ఎక్కువగా పోలీసులను మోసం చేశారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది కేసీఆరే అని విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని పేద ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు. అంతేందుకు రాష్ట్రంలో కరోనా వైరస్ కోసం చికిత్స ఆరోగ్య శ్రీ పథకంలో లేదన్నారు.

Recommended Video
అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ రిజర్వేషన్ ఇస్తే.. కేసీఆర్ తీసుకురావడం లేదన్నారు. చివరికీ మీడియా వారికి కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ కమీషన్లు ఫౌమ్ హౌస్‌కు వెళ్తున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా కాస్తా 3 శాతానికి పడిపోయిందన్నారు. కానీ దేశంలో ఇతరులకు సమాన హక్కులను కల్పించడం లేదా అని అడిగారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications