ఫిరాయింపులకు పెట్టింది పేరు కేసీఆర్, టీఆర్ఎస్: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు టీఆర్ఎస్, కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా టీఆర్ఎస్ తీరుపట్ల ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద టీఆర్ఎస్ నేతలు అభాసుపాలవుతున్నారని విమర్శించారు.
2018 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని లక్ష్మణ్ ఆరోపించారు. ఫిరాయింపుల చరిత్ర ఉన్న టీఆర్ఎస్.. బీజేపీపై నిందలు వేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామా చేయించి.. తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నుకునే సంప్రదాయం బీజేపీకి ఉందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
ఇది ఇలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ఎన్ని డ్రామాలకైనా తెరతీస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో ప్రచారం నిర్వహించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. మునుగోడు అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్‌కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమా? అని నిలదీశారు.
ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోనే డబ్బు తరలిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం హెలికాప్టర్ లోనైనా.. మంత్రుల కాన్వాయ్ లోనైనా డబ్బుల సంచులు తెస్తారని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో మునుగోడు నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రం నుంచి మంజూరైన నిధుల వివరాలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నికలు కాబట్టి అభివృద్ధిపైనా మాట్లాడాలన్నారు బండి సంజయ్. కేసీఆర్ బహిరంగ సభలో ఏడుస్తాడట.. ఏడ్పు నటించి సెంటిమెంట్‌తో ఓట్లు సాధించేలా నటించేందుకు రెడీ అయ్యారట అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆవేదనతో కళ్లకు నీళ్లు వస్తే బాధ అంటారు. కేసీఆర్ ఏడిస్తే.. దొంగ ఏడ్పు.. మోసపూరిత ఏడ్పు అంటారని అన్నారు.
కేసీఆర్ బిడ్డపై ఆరోపణలతోనే సీబీఐకి నో ఎంట్రీ జీవో ఇచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటి వరకు 36 మందిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలను చండూరు సభకు కేసీఆర్ తీసుకొస్తారని అన్నారు. కేసీఆర్ తప్పు చేయకుంటే.. సీబీఐకి ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. జీవో 51ని విడుదల చేసి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని దోచుకోకపోతే సీబీఐ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎక్కడ ఉన్నా బయటికి తీసుకొస్తామన్నారు డీకే అరుణ.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications