• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అఖిలప్రియ అరెస్టులో సంచలన ట్విస్ట్ -కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి -జగన్ సర్కారు సాయంతో..

|

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన 'బోయినపల్లి కిడ్నాప్' కేసు సంచలన మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో.. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. కొన్నాళ్లుగా నిప్పూఉప్పులా పోట్లాడుకుంటోన్న అఖిల-ఏవీలు భూదందాలను మాత్రం కలిసే చేస్తున్నారా? అనే అనుమానాలకు తావిచ్చేలా హైదరాబాద్ పోలీసులు కీలక విషయాలను బటయపెట్టారు. ఈ వ్యవహారంలో జగన్ సర్కారు సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

అఖిలప్రియకు వైద్య పరీక్షలు -గాంధీ నుంచి రిమాండ్‌కు -పరారీలోనే భర్త భార్గవరామ్ -కేసీఆర్ బంధువులతో..

ఏ1 సుబ్బారెడ్డి.. ఏ2 అఖిలప్రియ

ఏ1 సుబ్బారెడ్డి.. ఏ2 అఖిలప్రియ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బంధువులైన ముగ్గురు సోదరులు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్‌ రావులు మంగళవారం బోయినపల్లిలో కిడ్నాప్ కు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. గంటపాటు సోదాలు చేస్తున్నట్లు నటించి, ముగ్గురు సోదరులను కారులో అపహరించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బోయినపల్లి కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3గా భార్గవరామ్ పేర్లున్నాయని సీపీ చెప్పారు.

కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..

హఫీజ్‌పేట్ భూమిపై గొడవలు..

హఫీజ్‌పేట్ భూమిపై గొడవలు..

‘‘బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం.. కృష్ణ రెసిడెన్సీ నుంచి కిడ్నాప్ వ్యవహారం మొదలైంది. హఫీజ్ పేట్ ల్యాండ్ విషయంలో గత ఏడాది నుంచి జరుగుతోన్న వివాదమే కిడ్నాప్ కు దారి తీసింది. ఐటీ అధికారుల్లా ఫేక్ సెర్చ్ వారెంట్‌తో కిడ్నాపర్లు.. బాధితుడైన ప్రవీణ్ రావు ఇంట్లోకి వెళ్లారు. ఈ కేసులో ఏవీ నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ప్రమేయం ఉందనడానికి పక్కా ఆధారాలు లభించాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం ఏవీ సుబ్బారెడ్డి ఏ1 నిందితుడు'' అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిజానికి..

జగన్ సర్కారు సాయం..

జగన్ సర్కారు సాయం..

హఫీజ్ పేట్ భూ వివాదంపై గతేడాది సెప్టెంబర్‌లోనే ఓ కేసు నమోదైనట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భూవివాదంలో ఏ.వి.సుబ్బారెడ్డిపై ప్రవీణ్‌రావు గతంలో ఫిర్యాదు చేశాడరన్నారు. తాజా కిడ్నాప్‌ ఘటనలోనూ సుబ్బారెడ్డి, అఖిలప్రియ సహా ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందన్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామని సీపీ అంజనీ తెలిపారు. కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించినట్లు సీపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..

  Bhuma Akhila Priya To Start Film Production House || Oneindia Telugu
  సుబ్బారెడ్డి-అఖిలప్రియ కలిసిపోయారా?

  సుబ్బారెడ్డి-అఖిలప్రియ కలిసిపోయారా?

  హాఫీజ్‌పేట భూవివాదంపై హైదరాబాద్ సీపీ ప్రెస్ మీట్ ద్వారా ఏపీ రాజకీయాలకు సంబంధించి కొత్త కోణం తెర‌పైకి వ‌చ్చింది. ప్రస్తుతం నంద్యాల టీడీపీలో కీలక నేతగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి అనుచరుడిగా వ్యవహరించారు. నాగిరెడ్డి మరణం, అఖిలప్రియకు మంత్రి పదవి తర్వాత ఏవీకి భూమా కుటుంబంతో విభేదాలు పెరిగాయి. ఓ ద‌శ‌లో వీరి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మండిపోయేలా ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ కలిసి తనను హత్యచేయడానికి చూస్తున్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. భూమా నాగిరెడ్డికి చెందిన ప‌లు బినామీ ఆస్తులు ఏవీ పేరిట ఉన్నట్లు ప్రచారంలో ఉంది. నంద్యాలలో నిప్పూ-ఉప్పులా పోట్లాడుకుంటోన్న ఏవీసుబ్బారెడ్డి-భూమా కుటుంబాలు హఫీజ్ పేట్ భూవ్యవహారంలో క‌లిసిపోయాయా? రెండు వర్గాలూ కలిసికట్టుగానే కిడ్నాప్ కు స్కెచ్ వేశాయా? అనే చర్చ నడుస్తోంది.

  English summary
  sensational bowenpally kidnap case took an interesting turn as police named av subba reddy as prime accused(A1). speaking to media on wednesday hyderabad police commissioner aswini kumar told details of the case. cp says ap former minister bhuma akhila priya is A2 and her husband bhargav ram is A3.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X