హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే ఎఫెక్ట్: బాబు దుష్ప్రచారం అంటూ కేటీఆర్, దెబ్బకు దెబ్బ.. వాట్సాప్ సంభాషణ బయటపెట్టిన లగడపాటి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సర్వే పైన ఆయనకు, తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావుల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. లగడపాటి మంగళవారం రాత్రి విడుదల చేసిన సర్వే పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో తమ మధ్య సంభాషణ ఇలా జరిగిందని, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడితో మార్చివేశారని ఆరోపించారు.

దీనిపై లగడపాటి కూడా అంతే ధీటుగా స్పందించారు. కేటీఆర్ సూచనల మేరకు తాను కొన్ని స్థానాలలో సర్వే చేశానని, అవి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, తాను కేటీఆర్‌కు పెట్టిన సందేశం మహాకూటమి ఏర్పడకముందు అని, అప్పుడు 65 నుంచి 70 సీట్లు వస్తాయని చెప్పానని పూర్తి వివరణ ఇచ్చారు. లగడపాటి సర్వే, తాజాగా ఆయన స్పందన నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో బుధవారం పోస్ట్ పెట్టారు.

లగడపాటి సర్వే తెరాసకు గడ్డుకాలం, ఓటింగ్ పెరిగితే కూటమి క్లీన్‌స్వీప్, బీజేపీకి పెరగనున్న సీట్లు లగడపాటి సర్వే తెరాసకు గడ్డుకాలం, ఓటింగ్ పెరిగితే కూటమి క్లీన్‌స్వీప్, బీజేపీకి పెరగనున్న సీట్లు

కేటీఆర్ ట్వీట్

కేటీఆర్ ట్వీట్

'గోబెల్స్‌కే పెద్దన్న లాంటి చంద్రబాబు ఇటు తన అనుకూల మీడియా సంస్థలతో పాటు అటు సోషల్ మీడియాలో ఇంకా చాలా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.
వాళ్లు చేసే తప్పుడు ప్రచారంతో గందరగోళపడవద్దు అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణను కాపాడుతుంది'

అంతకుముందు రోజు, లగడపాటి సర్వే రాకముందు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కూడా మక్తల్ సభలో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం ఫేక్ సర్వే వస్తుందని చెప్పారు. అదో లంగ సర్వే అని, దానిని ఎవరూ విశ్వసించవద్దని చెప్పారు. ఆ తర్వాత సర్వే విడుదలయ్యాక కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే బుధవారం లగడపాటి దానిని తిప్పికొట్టారు.

లగడపాటి సర్వే పరిశీలిస్తే

లగడపాటి సర్వే పరిశీలిస్తే


మంగళవారం రాత్రి లగడపాటి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేదు. కానీ ఓట్లు పెరిగితే ఎవరికి, తగ్గితే ఎవరికి అనుకూలమో మాత్రమే చెప్పారు. కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మాత్రం ఆయన చెప్పలేదు. లగడపాటి చెప్పిన అంచనాలను బట్టి కాంగ్రెస్ పార్టీకి 46, టీఆర్ఎస్ పార్టీకి 31, పోటాపోటీగా 27 చోట్ల, మజ్లిస్ 7 చోట్ల గెలుస్తుందని, బీజేపీ దాదాపు ఏడెనిమిది స్థానాల్లో గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బండ్ల గణేష్ ట్వీట్

తనకు, లగడపాటికి మధ్య జరిగిన సంభాషణను కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. తమకు ఎక్కువ సీట్లు వస్తాయని అప్పుడు చెప్పి, ఇప్పుడు మరోలా సర్వే ఫలితాలు చెబుతున్నారని ఆరోపించారు. దీనిపై లగడపాటి కౌంటర్ ఇచ్చారు. అయితే లగడపాటి, కేటీఆర్‌కు మధ్య జరిగిన మరో సంభాషణను ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తాను అమెరికా వెళ్లిపోతానని, తాము ప్రతిపక్షంలో కూర్చోలేనని చెప్పినట్లుగా ఉంది.

ఎక్కువ సర్వేలు తెరాస వైపు

ఎక్కువ సర్వేలు తెరాస వైపు

కాగా, ఎక్కువ సర్వేలు తెరాస గెలుస్తుందని చెబుతున్నాయి. కానీ లగడపాటి సర్వే అందుకు భిన్నంగా ఉంది. అయితే ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పనప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఓటింగ్ శాతం పెరిగితే మాత్రం కూటమికి అవకాశముంటుందని చెప్పారు. కానీ 7వ తేదీన పోలింగ్ అనంతరం తాను సర్వే ఫలితాలు మరింత స్పష్టంగా చెబుతానని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
'Brother of Joseph Goebbels AKA CBN will make his cronies release more nonsense through his pet media houses and social media. Request all Telanganaites not to be confused or misled by the crooked propaganda.' KTR tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X