డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే అత్యున్నత ఉద్యోగం: మోడీపై కవిత పరోక్ష విమర్శలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని అన్నారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. మోసపూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా చేసిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రమం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోడీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు కవిత.

ఇంతకుముందు మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన విద్యార్హతలను వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇందుకోసం కోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు జరిమానా కూడా విధించింది.
Unemployment rate is at 7.8%, a 3 month high !
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2023
But is there any concern or effort to utilise the potential of young people?
The fact of the matter in today’s India is that - people with real degrees get no job and a person with no degree has the top job.
ఈ తీర్పుతో ప్రధాని మోడీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మోడీ విద్యావంతులైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications