Hyderabad: పల్లె బాట పట్టిన పట్నం.. రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..
హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతోన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. తెలంగాణలోని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా, ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ ప్రాంతాలు శుక్రవారం రద్దీగా మారింది.రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి 38 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో పేర్కొన్నారు. జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైనా భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. రైల్వే, ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను దోపిడీ చేస్తున్నాయి. భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భారీగా జనాలు పల్లె బాట పట్టడంతో హైదరాబాద్ ఖాలీగా మారింది.
ఆది, సోమవారం సిటీలో పూర్తిగా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఇటు శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. హైదరాబాద్ లో గంగిరెద్దులతో హరిదాసులు ఇండ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయిస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
చిన్నా పెద్దా కలిసి సంబురంగా గాలిపటాలను ఎగురవేస్తారు. మిగతా జిల్లాల్లో కూడా పండుగా వాతావరణం నెలకొంది. పిండి వంటలు తింటు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఏపీలో కూడా సంక్రాంతి సందడి మొదలైంది.












Click it and Unblock the Notifications