హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించలేము .. మాకు రక్షణ లేదంటున్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తో ఇప్పుడు ప్రపంచం మొత్తం గజగజవణికిపోతుంది. కరోనా వెలుగులోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా కరోనా కి సరైన మందు కనిపెట్టడంమాత్రం సాధ్యం కాలేదు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 733కు చేరగా మృతుల సంఖ్య 20కి పెరిగింది. ఇక తెలంగాణాలోనూ కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉంది . కేసుల సంఖ్య 47 కు చేరింది .

అనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే .. గాంధీలో ఓపీ బంద్ .. ఉస్మానియాకి రోగుల తాకిడిఅనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే .. గాంధీలో ఓపీ బంద్ .. ఉస్మానియాకి రోగుల తాకిడి

కరోనా బాధితులకు సేవ చెయ్యాలంటే భయపడుతున్న వైద్య సిబ్బంది

కరోనా బాధితులకు సేవ చెయ్యాలంటే భయపడుతున్న వైద్య సిబ్బంది


ఇక కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యటానికి ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.కరోనా ప్రాణాలు తీస్తుందని తెలిసినప్పటికీ కూడా డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా సోకిన వారికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ సరైన సదుపాయాలూ లేవని, వైద్య సిబ్బందికి సరైన రక్షణ ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . దీనితో కరోనా కి భయపడిన వారు గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా సెలవులపై వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు .

ఫ్యామిలీతో గడపాలంటే భయంగా ఉందంటున్న వైద్య సిబ్బంది

ఫ్యామిలీతో గడపాలంటే భయంగా ఉందంటున్న వైద్య సిబ్బంది

అందులో పని చేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు కరోనా వార్డులో పనిచేయలేమంటూ తేల్చి చెప్తున్నారు. ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులకు 24 గంటలూ సేవలందిస్తున్నామని తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అని భయంగా ఉందని వారు అంటున్నారు . తమ జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు సేవలు చేసిఇంటికెళ్లి భర్త , పిల్లలను కలిసేందుకు కూడా భయం వేస్తోందని వారు అంటున్నారు .

 కరోనా బాధితులకు సేవలు చేస్తే అన్నీ ఇబ్బందులే

కరోనా బాధితులకు సేవలు చేస్తే అన్నీ ఇబ్బందులే

కరోనా బాధితులకు సేవ చేస్తున్న తాము ఇంటి నుంచి బయటికొస్తే కాలనీవాసులకు భయపడాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రిలో నర్సులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు నర్సులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ ను కోరారు. అంతేకాదు తమ విధులను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలి అనుకుంటే తమ భర్తలను రోడ్ మీద ఆపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ ఇబ్బందులు పడలేమని వారు చెప్తున్నారు . కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించలేము అని వారు అధికారుల దృష్టికి తీసుకువేల్తున్నారు. ఇక వీరి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి .

English summary
Serving the corona victims, the colonists have revealed that they are afraid to leave the home. Nurses in the hospital want to be fully protected. To this end, the nurses demanded the government and asked the hospital superintendent Shravan Kumar. They also urge their husbands not to stop on the road if they want to go home after completing their duties. They say these difficulties cannot be overstated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X