హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లకు వెళ్లేవారికి ముఖ్య గమనిక

దేశవ్యాప్తంగా రైళ్లల్లో ప్రయాణిస్తున్నవారి కోసం రైల్వే భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. గతేడాది ఒడిసాలోని బాలసోర్ వద్ద జరిగిన దుర్ఘటనలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఏర్పడటమేనని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ తరహా ప్రమాద సంఘటన మరొక్కటి కూడా చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో దేశంలోని అన్ని రైల్వే జోన్ల పరిధిలో, డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికకీరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంతకల్-బీదర్ (07671) మధ్య నడుస్తున్న రైలును రద్దు చేశారు. అలాగే ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు బోధన్ నుంచి కాచిగూడ మధ్య నడుస్తున్న (07275) రైలును కూడా రద్దు చేశారు. ఇంకా ఏయే రైళ్లు రద్దయ్యాయో తెలుసుకుందాం.

Cancellation of trains within Hyderabad and Secunderabad and Kachiguda railway stations

ఆగస్టు 2-సెప్టెంబర్ 1 కాచిగూడ-గుంతకల్ (07670)
ఆగస్టు 1-31 కాచిగూడ-రాయచూర్ (17693)
ఆగస్టు 1-31 రాయచూర్-గద్వాల్ (07495)
ఆగస్టు1-31 గద్వాల్-రాయచూర్ (07496)
ఆగస్టు 1-31 రాయచూర్-కాచిగూడ (17694)

ఆగస్టు 1-31 కాచిగూడ-నిజామాబాద్ (07596)
ఆగస్టు 1-31 నిజామాబాద్-కాచిగూడ (07593)
ఆగస్టు 1-31 మేడ్చల్-లింగంపల్లి (47222)
ఆగస్టు 1-31 లింగంపల్లి-మేడ్చల్ (47225)
ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47235)

ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47236)
ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47237)
ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47238)
ఆగస్టు 1-31 మేడ్చల్-సికింద్రాబాద్ (47242)
ఆగస్టు 1-31 సికింద్రాబాద్-మేడ్చల్ (47245)

పనులు జరుగుతున్న తీరును బట్టి కావాలనుకుంటే మరికొద్ది రోజులు వీటిని రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం పైన పేర్కొన్న తేదీల వరకు వీటిని రద్దు చేశారు. సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తిచేస్తామని, అప్పటిలోగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+