హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుండి: రూ. 6200 కోట్లతో క్యాపిటల్యాండ్ డేటా సెంటర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. డేటా సెంటర్ ఏర్పాటు సహా విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో రూ. 6,200 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు క్యాపిటల్యాండ్ సంస్థ తెలిపింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, క్యాపిట‌ల్యాండ్ ఇండియా ట్ర‌స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ సంజీవ్ దాస్ గుప్తా, రియ‌ల్ అసెట్స్ సీఈవో పాట్రిక్ బూకాక్ పాల్గొన్నారు.

భారీ పెట్టుబడితో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది క్యాపిటల్యాండ్. రూ. 1200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని క్లైంట్ ఇంటర్నేషనల్ టేక్ పార్క్‌లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

capitaland company signs mou with telangana government.

2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఐటీపీహెచ్ డేటా సెంటర్ ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని క్యాపిటల్యాండ్ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదేళ్లలోమరో రూ. 5 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మొత్తంగా రూ.6200 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు కంపెనీ తన ప్రణాళికను వెల్లడించింది. క్యాపిటల్యాండ్ పెట్టుబడిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని అన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపర్చడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతోందన్నారు. హైదరాబాద్ లో రోజు రోజుకూ పెరుగుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయన్నారు కేటీఆర్.

English summary
capitaland company signs mou with telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X