ఏందిది షకీల్.. అప్పుడు అలా చెప్పి.. అంతలోనే మాట మార్పు..కారు కజిన్‌దట

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు. ప్రమాదం గురించి తనకు తెలిసిందని.. కొత్తగా చెప్పారు. అంతకుముందు.. తన కారు కాదని చెప్పిన సంగతి తెలసిందే. ఇప్పుడు కూడా ప్రమాదానికి గురైన కారు తనదికాదని ఆయన స్పష్టం చేశారు. తన కజిన్ కారు తగిలి పసిపాప మృతి చెందిందని తెలిపారు. తన కజిన్ కారును తాను కూడా అప్పుడప్పుడు వాడతానని కవరింగ్ చేశారు. అందుకే ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టామని పేర్కొన్నారు.

 బాధ కలిగించింది..

బాధ కలిగించింది..


అయితే చిన్నారి ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందని వివరించారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్‌కు చెప్పానని తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందన్నారు. దాంతో బాబుని కింద పడేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. ఇక విషయాన్ని పోలీసులపై నెట్టారు.

 సీసీ ఫుటేజీ చూడండి..

సీసీ ఫుటేజీ చూడండి..


అంతేకాదు సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్‌కి చెప్పానని తెలిపారు. ఘటన జరగడం బాధాకరం అని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న మహిళని కారు ఢీకొంది. మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ఘటనపై ఇప్పుడు ఎమ్మెల్యే స్పందించారు.

షకీల్ కజిన్ మీర్జా..

షకీల్ కజిన్ మీర్జా..


బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ కజిన్ మీర్జా కారు నడిపినట్లు తెలుస్తోంది. కారు రిజిస్ట్రేన్‌ మాత్రం ఇన్‌ఫ్రా కంపెనీ పేరుతో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారని అంటున్నారు. కారుకు ఎమ్మెల్యే స్టికర్‌ ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీయగా.. షకీల్ విషయం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+