హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోం వర్క్ వద్దు.. "స్కూల్ బ్యాగ్" బరువుల్లో కోత.. కేంద్రం ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అమ్మా.. చాలా బరువవుతోందమ్మా..! నేను మోయలేకపోతున్నా..! వాడెంత.. వాడి చదువెంత.. వాడు మోసే బరువెంత? సదువు సారెడు.. బలపాలు దోసెడు. ఇలాంటివి మనం ఎన్నో వింటుంటాము. పీజీ చదివే వాళ్ల చేతిలో ఒక్క పుస్తకం ఉంటే.. ఎల్కేజీ చదివే ఐదేళ్ల పిల్లల వీపుపై మోయలేనంత భారం. అంతేకాదు చేతులు నొప్పి పుట్టేంత హోమ్ వర్క్. ఐదేళ్ల పిల్లలకు ఐదు కిలోలు ఉండేంత "చదువు బరువు" మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పిల్లలపై "చదువు భారం" తగ్గనుంది.

అన్నీ తరగతులకు స్కూల్ బ్యాగుల బరువును పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి, రెండు తరగతులు చదివే చిన్నారులకు హోం వర్క్ ఇచ్చే విధానానికి స్వస్తి పలికింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్నీ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ కొత్త రూల్స్ అమలుకానున్నాయి.

స్కూల్ బ్యాగ్ లిమిట్స్.. బరువుపై కేంద్రం పరిమితులు

స్కూల్ బ్యాగ్ లిమిట్స్.. బరువుపై కేంద్రం పరిమితులు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చదువు బరువులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతుల చిన్నారులకు బోధించే అంశాలను క్రమబద్దీకరించాల్సి ఉంటుంది. స్కూల్ బ్యాగుల బరువుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలి.

ఒకటి, రెండు తరగతులు చదివే చిన్నారుల స్కూల్ బ్యాగుల బరువు కిలోన్నర, 3 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు సంబంధించి స్కూల్ బ్యాగ్ బరువు 2 నుంచి 3 కిలోల వరకు పరిమితి చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటికి అదనంగా ఇతర పుస్తకాలు, మెటీరియల్స్ అంటూ పిల్లల్ని వత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. ఇక 6, 7 తరగతులు చదివే పిల్లల స్కూల్ బ్యాగ్ ల బరువు 4 కిలోలకు మించొద్దని, 8,9 విద్యార్థుల స్కూల్ బ్యాగులు నాలుగున్నర కిలోలు దాటరాదని పేర్కొంది. పదవ తరగతి అభ్యసించే విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు 5 కిలోలు మించరాదని తెలిపింది.

బోధనాంశాల్లోనూ లిమిట్..!

బోధనాంశాల్లోనూ లిమిట్..!

స్కూల్ బ్యాగ్ బరువులపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం బోధనాంశాల్లోనూ లిమిట్స్ పెట్టింది. ఒకటి, రెండు తరగతులకు ఒక భాషాంశానికి తోడు గణిత శాస్త్రం మాత్రమే ఉండాలని పేర్కొంది. అంతే తప్ప మరే ఇతర బోధనాంశాలు ఉండకూడదని తెలిపింది. 3-5 తరగతులకు NCERT సూచించిన మేరకు భాషాంశాలు, ఈవీఎస్, గణితశాస్త్రం మాత్రమే బోధానాంశాలుగా ఉండాలని స్పష్టం చేసింది.

 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఏమయినట్లో..!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఏమయినట్లో..!

గతేడాది తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బ్యాగుల బరువులపై పరిమితులు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల బరువులను నియంత్రించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతేడాది గానీ, ఈ సంవత్సరం గానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నట్లు కనిపించడం లేదు. పిల్లలపై చదువుల భారానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.

English summary
prescribed weight limit of school bags for all classes are part of the fresh directives issued by the HRD ministry to states and union territories across the country. No homework for students of classes I and II.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X