హైదరాబాద్ నుంచి బయల్దేరిన చార్టర్ విమానం పాక్‌లో ల్యాండ్: కారణం తెలియరాలేదు
హైదరాబాద్: 12 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఒక చార్టర్ విమానం పాకిస్థాన్‌లోని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్ వర్గాలు తెలిపాయి.
ఆ వర్గాల కథనం ప్రకారం ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరింది. మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది.

కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. అయితే, కరాచీ విమానాశ్రయంలో ఎందుకు ఈ విమానం ల్యాండ్ అయ్యిందనే విషయం తెలియాల్సి ఉంది.
సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రతినిధి ఈ పరిణామాన్ని ధృవీకరించారు. అంతర్జాతీయ చార్టర్ విమానం భారతదేశం నుంచి బయల్దేరిందని, దానికి దేశంతో మరే ఇతర సంబంధం లేదని అన్నారు.
Recommended Video

కాగా, జులై నెలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో దిగాయి. స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం దాని ఇంధన సూచికలో మధ్యస్థంగా పనిచేయకపోవడంతో జూలై 5న కరాచీకి మళ్లించబడింది. ఇండిగోకు చెందిన షార్జా-హైదరాబాద్ విమానాన్ని పైలట్‌లు ఇంజన్‌లో ఒకదానిలో లోపం గమనించిన తర్వాత జూలై 17న ముందుజాగ్రత్తగా కరాచీకి మళ్లించారు.












Click it and Unblock the Notifications