హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్ పోర్టులో ఆ కష్టాలకు చెక్.. శంషాబాద్ విమానాశ్రయంలో నేటినుండి అందుబాటులోకి డిజీయాత్ర యాప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేంద్రం ఆమోదించిన డిజియాత్ర కార్యక్రమానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిజియాత్ర ప్లాట్‌ఫారమ్ ద్వారా నేటి నుండి సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిజియాత్ర యాప్ డాక్యుమెంట్స్ పరిశీలనకు క్యూలో నిలబడే ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. విమానాశ్రయంలో ఎటువంటి అవాంతరాలు లేని ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఎయిర్ పోర్ట్ లో జరిగే అనేక తనిఖీలను నివారిస్తుంది.

ఎయిర్ పోర్ట్ లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, డిజీయాత్ర యాప్ తో ప్రయాణం సులభం

ఎయిర్ పోర్ట్ లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, డిజీయాత్ర యాప్ తో ప్రయాణం సులభం


డిజియాత్ర యాప్ తో, ఎంపిక చేసిన చెక్‌పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రయాణికులు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతారు. ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఎయిర్ పోర్టు లో జరిగే తతంగం అంతా ఇంతా కాదు. టికెట్ తీసుకుని , బోర్డింగ్ పాస్ తర్వాత డాక్యుమెంట్స్ పట్టుకొని క్యూలో నిలబడి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత టెర్మినల్ కు వెళ్లాల్సి ఉంటుంది.

డిజి యాత్ర యాప్ తో చెకింగ్స్ లేకుండా నేరుగా టెర్మినల్ కు

డిజి యాత్ర యాప్ తో చెకింగ్స్ లేకుండా నేరుగా టెర్మినల్ కు

కానీ డిజి యాత్ర యాప్ ఇకనుండి ఆ కష్టాలకు చెక్ పెట్టనుంది. ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత టిక్కెట్, బోర్డింగ్ పాస్, డాక్యుమెంట్లు పట్టుకొని క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా టెర్మినల్ కు వెళ్ళడానికి డిజీ యాత్ర యాప్ నేటి నుండి అందుబాటులోకి రానుంది. డిజియాత్ర ప్రోగ్రాం ద్వారా అందించే ప్రయోజనాలను పొందేందుకు ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. డిజీ యాత్ర యాప్ లో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు దీని ఆధారంగా ప్రయాణికులు చెకిన్ అయ్యే వీలుంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు.

సెల్ ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ లింక్ చెయ్యాలి

సెల్ ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ లింక్ చెయ్యాలి

ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఢిల్లీ , బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఉపయోగిస్తున్నారు. డిజీ యాత్ర యాప్ ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికులు యాప్ ని తమ సెల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం ప్రయాణికులు ముందుగా ఒక సెల్ఫీ తీసుకొని, ఆపై డిజి యాత్ర ఐడిలను విమాన బుకింగ్ నుండి లేదా మన బోర్డింగ్ తో లింక్ అవ్వాలి.

యాప్ ద్వారా పూర్తి డేటాబేస్ .. అవాంతరాలు లేకుండా నేరుగా టెర్మినల్ కు

యాప్ ద్వారా పూర్తి డేటాబేస్ .. అవాంతరాలు లేకుండా నేరుగా టెర్మినల్ కు

ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ముందుగానే యాప్ లో లింకు చేస్తాం కాబట్టి దాని నుండి మన పూర్తి డేటాబేస్ తీసుకుంటుందని అధికారులు తెలిపారు. డిజియాత్ర యాప్ చొరవ విమానయాన ప్రయాణికులకు, ప్రయాణంలోని అన్ని దశల్లో వేగవంతమైన, అవాంతరాలు లేని, డిజిటల్‌గా ఏకీకృత విమాన ప్రయాణ అనుభవాన్ని అందజేస్తుందని చెబుతున్నారు.

English summary
Digi yatra app will be available at Shamshabad Airport from today. This will check the difficulties at the airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X