ఇదేందీ సారూ.. ఇద్దరు చచ్చాక కంటితుడుపు చర్య..? ప్రైవేట్ టీచర్లకు రూ.2 వేలు, బియ్యం..
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రైవేట్ టీచర్ల వెతలను ఆలకించింది. స్కూల్స్ క్లోజ్ చేయడంతో వారు పడుతోన్న ఇబ్బందులపై దృష్టిసారించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ ప్రైవేట్ టీచర్, అతని భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం నెలకు రూ.2 వేలు, బియ్యం అందజేస్తామని కంటితుడుపు ప్రకటన చేసింది.

కంటి తుడుపు చర్య...
ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. నెలకు 2 వేలతో పాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు, సిబ్బందికి వర్తిస్తాయి. రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం సరఫరా చేస్తారు. టీచర్లు, సిబ్బంది బ్యాంక్ అకౌంట్ వివరాలను కలెక్టర్లకు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. విధివిధానాలు ఖరారు చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షా 45 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది లబ్ధి పొందుతారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నమని సీఎం కెసిఆర్ తెలిపారు.

విషాదం.. భర్త, తర్వాత భార్య
సీఎం కేసీఆర్ ప్రకటన కన్నా ముందు విషాదం జరిగింది. నాగార్జున సాగర్‌లో ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్స్ క్లోజ్ చేయడం, ఉపాధి లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఇంకేముంది జీవితం చాలు అనుకొని రెండురోజుల క్రితం సూసైడ్ చేసుకున్నాడు. ఆయన లేని లేటును భార్య జీర్ణించుకోలేకపోయింది. గురువారం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వల్ల స్కూల్ మూసివేయడంతో.. ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారు అయిపోయారు.

జగిత్యాల టీచర్ వెతలు
ఇదివరకు జగిత్యాలలో గల పోచమ్మవాడకు చెందిన గడప చంద్రశేఖర్ ఇబ్బంది పడ్డారు. స్కూల్ క్లోజ్ చేయడంతో ఆయన పరిస్థితి దుర్బరంగా మారింది. సీఎం కేసీఆర్‌కు తమ దుస్థితి వివరిస్తూ వీడియోను రూపొందించారు. సీఎం కేసీఆర్ గారికి నమస్కారాలతో అంటూ ఆయన వీడియో స్టార్ట్ అవుతోంది. జగిత్యాల పోచమ్మవాడలో ఉంటానని చెప్పారు. గత 20ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నానని.. అరకొర జీతాలతో ఇన్నాళ్లు పనిచేశామని వివరించారు. కరోనా వల్ల ఏడాది పాటు స్కూల్స్ మూత పడ్డాయని తెలిపారు. దీంతో ఉపాధి కోల్పోయామని.. జీవించడానికి అప్పులు చేశామని మొర వినిపించారు. అప్పులు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. లోన్‌లో బండి తీసుకున్నానని.. ఈఎంఐ కూడా కట్టలేక పోతున్నామని చెప్పారు. ఫైనాన్స్ వేధింపులు కూడా ఎక్కువయ్యాయని వివరించారు. బతకలేని స్థితిలో ఉన్నామని.. తమకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.












Click it and Unblock the Notifications