ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను ప్రారంభించిన... సీఎం కేసీఆర్
హైదరాబాద్ హైదర్‌గూడలో నిర్మించిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నూతన భవనాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సీఎంతోపాటు స్పికర్ పోచారం శ్రీనివాసరెడ్డి,మంత్రులు జగదీశ్‌రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోన్నారు. అనంతరం సీఎం నూతన క్వార్టర్స్‌ను పరీశీలించారు.

కాగా హైదర్‌గూడలో నిర్మిస్తున్న క్వార్టర్స్‌ను మొత్తం 4.5 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో 120 క్వార్టర్లను నిర్మించారు. ప్రతి ప్లాట్ 2500 చ.అ విస్తిర్ణంతో త్రిబుల్ బెడ్ రూం ప్లాట్స్‌ను అధునూతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌తోపాటు అందులో పని చేసే అసెంబ్లీ సిబ్బంది కోసం క్వార్టర్స్‌ను కూడ మరో 36 ప్లాట్లను నిర్మించగా మరో 120 క్వార్టర్స్‌ను ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది,ఇతన
సర్వేంట్ల కోసం నిర్మించారు.

మరోవైపు క్వార్టర్స్‌లో గ్రౌండ్ ప్లోర్‌తో పాటు 12 ఫ్లోర్స్‌తో పాటు సందర్శకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా 23హాళ్లతో పాటు, బ్యాంకు, క్లబ్ హౌజ్ ,సూపర్ మార్కెట్ లాంటీ నిత్యవసరాల కోసం కూడ గదులు ఏర్పాటు చేశారు. కాగా ఎమ్మెల్యేల కోసం అంతకు ముందు నిర్మించిన భవనాలతోపాటు ఆదర్శ్ నగర్‌లో నిర్మించిన భవనాలు కూడ అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications