నా బలం, బలగం.. కేసీఆర్, ప్రజలు.. ఇదీ నామా మాట..?
ఇటీవల ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తన గురించి ప్రజలకు అంతా తెలుసని.. నీతి నిజాయితీగానే ఉన్నానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తనను ఏ నమ్మకంతో పార్లమెంటరీ పార్టీ నాయకునిగా పెట్టారో.. అదే నమ్మకంతో పని చేస్తానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పారు. తన బలం కేసీఆర్, బలగం నియోజక వర్గ ప్రజలు అని స్పష్టంచేశారు.

40 ఏళ్ల క్రితం మధుకాన్ ఏర్పాటు
40 ఏళ్ల క్రితం మధుకాన్ కంపెనీని స్థాపించానని నామా తెలిపారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేశామని వివరించారు. ముంబై నుంచి మంగళూరు ప్రాజెక్టు చేశామని చెప్పారు. చైనా బర్డర్‌లో కూడా మేము రోడ్లు వేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉండటం వల్ల ఆ కంపెనీలు మా సోదరులు చూస్తున్నారని.. రాంచీ ఎక్స్ప్రెస్ వే, ఎస్పీవి బీవోటీ ప్రాజెక్టు 30 శాతం ఈక్విటీతో 2011లో ప్రారంభమైందని తెలిపారు. ఎన్‌హెచ్ఏ అగ్రిమెంట్ తర్వాత 80 శాతం.. 90 రోజుల్లో 100 శాతం సైట్ ఇవ్వాలన్నారు.

ఏడేళ్లు అయిన..
ఏడేళ్లు అయిన ఎన్‌హెచ్ఏ పూర్తి సైట్ ఇవ్వలేక పోయిందని.. సైట్ ఇచ్చిన మేరకు 60 శాతం పని పూర్తి అయిందన్నారు. కేవలం 10 శాతం మేర పెండింగ్‌లో ఉందని.. ఏ కారణం చేతో కంపెనీని టర్మినేట్ చేశారని తెలిపారు. రూ.1655 కోట్ల ప్రాజెక్టులో 463 కోట్లు కంపెనీ.. మిగతాది బ్యాంక్‌లు ఇవ్వాలని తెలిపారు. ఆ డబ్బులు మొత్తం ఎస్క్రూ అకౌంట్‌లో వేయాలని... దానిపై పూర్తి అధికారం బ్యాంక్‌దేనని చెప్పారు.

ఇదీ లెక్క..
485 కోట్లు కంపెనీ పెట్టిందని.. 652 కోట్లు మాత్రమే బ్యాంక్ పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్‌హెచ్‌ఏ సైట్ ఇవ్వక పోవడం వల్ల ప్రాజెక్టు డిలే అయిందని స్పష్టంచేశారు. 50 శాతం పని పూర్తి అయినందున మిగతా నిధులు తామే ఇస్తామని ఎన్‌హెచ్ఏ చెప్పి, వెనక్కి వెళ్ళిందని.. ఎవరూ ఈ ప్రాజెక్టు మీదా కంప్లైంట్ చేయలేదన్నారు. బీహార్‌లో చెట్లు కొట్టిన కేసుకి సంబంధించి ఒక పిల్‌లో ఈ ప్రాజెక్టుని ఇంప్లీడ్ చేశారని స్పస్టంచేశారు. ఆర్బిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. అవార్డ్ అయ్యే వరకు కంపెనీ వేచి చూస్తుందని.. ఆ కంపెనీలో తను డైరెక్టర్ కూడా కాదు అని నామా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications