మరో ముందడుగు: గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో కేసీఆర్ భేటీ
నేషనల్ పాలిటిక్స్‌పై సీఎం కేసీఆర్ సీరియస్ నెస్ పెంచారు. వరసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తున్నారు.బీజేపీ ముక్త భారత్ నినాదాన్ని ప్రజల్లోకి సీఎం కేసీఆర్ బలంగా తీసుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలువడం.. ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్‌కు గుజరాత్ కీలక నేత శంకర్ సింగ్ వాఘేలా వచ్చారు.

కీ మీట్..
సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు.జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త పార్టీ ఏర్పాటు
శంకర్ సింగ్ వాఘేలా ఇటీవల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపుతారు. 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ రాజకీయాలు, బీజేపీ కబంద హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలని వారిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్..
టీఆర్ఎస్ ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారుతుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ జెండా వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చని సమాచారం. ఎన్నికల గుర్తు విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై క్షేత్రస్థాయిలో చర్చ జరిగి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.












Click it and Unblock the Notifications