హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగాస్టార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ : వాకబు - ఆకాంక్ష..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. రెండు రోజుల క్రితం చిరంజీవి రెండో సారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో తాను కరోనా బారిన పడ్డానని..తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిరంజీవి ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. త్వరగా కోలుకుంటారని ఆకాక్షించారు.

ఇద్దరు సీఎంలతో సత్సంబంధాలు

ఇద్దరు సీఎంలతో సత్సంబంధాలు

ఇప్పటికే చిరంజీవి మరోసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేసారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్వీట్ ద్వారా ఆయన త్వరిగతగిన కోలుకుంటారని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమ - ప్రభుత్వాల మధ్య చిరంజీవి ఇటు తెలంగాణ - అటు ఏపీ ప్రభుత్వాలతో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ కేసీఆర్ తోనూ చిరంజీవి సినీ ప్రముఖలతో కలిసి సమావేశమయ్యారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు ఏ రకమైన సమస్యలు ఉన్నాయి.. ఏం కావాలో వివరించారు.

టాలీవుడ్ అంశాల పై పెద్దన్నగా

టాలీవుడ్ అంశాల పై పెద్దన్నగా

ఆ సమయంలో కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. ఇక, ఏపీ ప్రభుత్వంతో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం పైన వివాదం సాగుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి అమరావతి వెళ్లి జగన్ తో సమావేశమయ్యారు. ఇద్దరూ లంచ్ మీటింగ్ లో సినీ ఇండస్ట్రీ సమస్యల పైన చర్చ చేసారు. ఆ తరువాత తాను సీఎం ఆహ్వానం మేరకే వచ్చానని చెబుతూ..సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని...త్వరలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత మరోసారి కలిసి... తుది డ్రాఫ్ట్ సిద్దం చేద్దామని చెప్పారని చిరంజీవి వివరించారు.

కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ

కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ

దీని ద్వారా ఏపీలోనూ సినీ పరిశ్రమకు మేలు జరిగేలా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక, వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వం నియమించిన కమిటీ సినిమా టిక్కెట్ల ధరల అంశం పైన భేటీ కానుంది. ఆ తరువాత మరోసారి చిరంజీవి అమరావతికి వచ్చి సీఎం జగన్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక, చిరంజీవి త్వరగా కోలుకోవలాంటూ సినీ రంగం నుంచే కాకుండా పలువురు ప్రముఖులు ఆకాక్షింస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

English summary
CM KCR phone call to Chiranjeevi, Wished his speedy recovery from Covid. Chiranjeevi tested covid positive on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X