తెలుగు ఠీవీ పీవీ.. ఎంత స్మరించినా తక్కువే, సీఎం కేసీఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఇవాళ. హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని (నెక్లెస్ రోడ్) పీవీ ఘాట్ వద్ద నివాళి పలువురు ప్రముఖులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏడాది నుంచి జరుగుతున్న పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు.
Recommended Video
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నం అవుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. ఏడాదిలో కే కేశవరావు ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. అందరికీ సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

పీవీ నరసింహారావు శతజయంతి సందర్బంగా 16 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిని చూస్తుంటే కడుపు నిండిపోయిందని కేసీఆర్ అన్నారు. ఈ రహదారికి పీవీ మార్గ్ అని నామకరణం చేయడం సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. భవిష్యత్‌లో అనేక పథకాలకు పీవీ పేరు పెడతామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ జయంతి కావడంతో నివాళులు అర్పించి.. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. పీవీ తెలుగు ఠీవీ అని ఏడాదిపాటు కీర్తించారు. ఉమ్మడి పాలనలో పీవీ గురించి పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications