హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీహెచ్ మళ్లీ వేశాడు: ముందు నా విగ్రహాం రిలీజ్ చేయ్, కేసీఆర్‌కు సవాల్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని చాలా మంది స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా రియాక్ట్ అయ్యారు. కానీ సీఎం కేసీఆర్ నిఖార్సైన అంబేద్కర్ వాదీ అవాలంటే అంటే గతంలో జరిగిన ఘటనను గుర్తుచేశారు.

ఆదర్శమే..

ఆదర్శమే..


సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని వీహెచ్ పేర్కొన్నారు. లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ విగ్రహాం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారని కుండబద్దలు కొట్టారు. లేదంటే కారని పేర్కొన్నారు.

 ఇదీ విషయం

ఇదీ విషయం


2019 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. పంజాగుట్టలో ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజే ఆ విగ్రహాన్ని ఎవరో కూల్చివేశారు. దీంతో వీహెచ్ మరో విగ్రహం చేయించారు. ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయి జైల్లో వేశారని, తనపై కేసు నమోదు చేశారని వీహెచ్ వాపోయారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు కూడా లేఖలు రాశారు. కానీ ఇప్పుడు సచివాలయానికి పేరు పెట్టడంతో తన విగ్రహాం గురించి ప్రస్తావించారు.

పేరు కూడా

పేరు కూడా


సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపనుండగా.. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ గురించి తర్వాత మాట్లాడుదాం.. ముందు కొత్తగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

సవాల్‌తో కదలిక

సవాల్‌తో కదలిక


దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ స్పూర్తి లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేసీఆర్ కామెంట్ చేశారు. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని గుర్తుచేశారు.

English summary
congress senior leader vh demand release of ambedkar statue at lockup
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X