హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీకా ఇవ్వండి మహాప్రభో.. సిటీలో కొరత, జనం ఇబ్బందులు

|
Google Oneindia TeluguNews

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. కరోనాకు టీకాతోనే చెక్ పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కరోనా టీకా రెండో డోసు ఇస్తున్నారు. దీంతో ఫస్ట్ డోసు తీసుకునేవారికి ఇబ్బంది తప్పడం లేదు. అంతకుముందు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇచ్చినా.. ఇప్పుడు అదీ కూడా ఇవ్వడం లేదు. ఇక గ్రేటర్ పరిధిలో అయితే చెప్పక్కర్లేదు.

జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. సిటీలో సెకండ్ డోస్ కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిగతా చోట్ల ఫస్ట్ డోస్ కోసం కూడా అపసోపాలు పడుతున్నారు. టీకా కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర జనం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో పీహెచ్‌సీలో 100 నుంచి 200 మంది మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అటు సరూర్ నగర్ టీకా సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. టీకా సెంటర్ వద్ద గుంపులు గుంపులుగా జనం చేరుకున్నారు. రోజుల తరబడి వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న టీకా అందలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

corona vaccine 2nd dose shortage at hyderabad

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

Corbevax: Biological E's COVID-19 Vaccine To Be Launched By September | Oneindia Telugu

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

English summary
corona vaccine 2nd dose shortage at hyderabad city. people are suffering for vaccine. they wait a que line for more days but not get vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X