Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chilkur Balaji: మందే లేని మహమ్మారి: చిల్కూర్ బాలాజీ ఆలయంలో..!

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్. ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టిన మహమ్మారి. అగ్ర దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ పేరు వింటే. ఈ వైరస్‌ పుట్టినల్లు చైనాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క చైనాలోనే 560 కరోనా వైరస్ బారిన పడి మరణించారు. 10 వేలమందికి పైగా చైనీయుల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనాకు మాత్రమే పరిమితం కాలేదీ వైరస్. భారత్ సహా ప్రపంచంలో 20కి పైగా దేశాలకు విస్తరించింది. మనదేశంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.

విసాల వెంకన్న ఆలయంలో..

విసాల వెంకన్న ఆలయంలో..

కరోనా వైరస్‌ను నియంత్రించడానికి అవసరమైన మందులేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరమాత్ముడొక్కడే దీన్ని నియంత్రిస్తాడని నమ్ముతున్నారు భక్తులు. అందుకే- విసాల వెంకన్నగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత చిల్కూర్ బాలాజీ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనడానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో వెలిసిన చిల్కూర్ బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

ప్రధాన అర్చకుడు రంగరాజన్ నేతృత్వంలో..

ప్రధాన అర్చకుడు రంగరాజన్ నేతృత్వంలో..

చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పండితుల సారథ్యంలో ఈ తెల్లవారు జామున 6 నుంచి 10 గంటల వరకు ఈ ప్రత్యేక పూజలను నిర్వహించారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. ఆలయ వ్యవస్థలో అరుదుగా భావించే `అపమర్జనా స్తోత్రాన్ని` ఈ సందర్భంగా పఠించారు అర్చకులు. అపమర్జనా స్తోత్రం, సుదర్శనాష్ఠక పఠనంతో బాలాజీ ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి.

ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు..

ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు..


ఉదయం 10:30 గంటలకు బాలాజీ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలోని తిరుమాడా వీధుల్లో వేద మంత్రోచ్ఛారణలు..వందలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారి విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా అర్చకులు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. హైదరాబాద్ నుంచే కాకుండా చేవెళ్ల, తాండూరు, పరిగి, నాగర్ కర్నూల్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. కరోనా వైరస్ నియంత్రణ పూజల్లో పాల్గొనడానికి చిల్కూర్ ఆలయానికి చేరుకున్నారు.

మందులేని మహమ్మారిని నియంత్రించే శక్తి ఆ భగవంతుడికే..

మందులేని మహమ్మారిని నియంత్రించే శక్తి ఆ భగవంతుడికే..


అనంతరం రంగరాజన్ విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఇన్ని రోజులైనప్పటికీ.. మందులను కని పెట్టలేకపోతున్నారని అన్నారు. ఇదివరకు ప్లేగు, కలరా వంటి మహమ్మారి తరహాలో ఇది విస్తరిస్తోందని అన్నారు. ఇప్పటికే చైనాలో వందలాది మందిని పొట్టన పెట్టుకుందని, దీన్ని నియంత్రించడానికి ఎలాంటి మందులూ లేవని, దీన్ని నియంత్రించ గల శక్తి ఆ భగవంతుడికొక్కడికే ఉందని అన్నారు. అందుకే స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించామని రంగరాజన్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+