Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిల్కూర్ బాలాజీ ఆలయంలో నేడే చివరి దర్శనం: రేపటి నుంచి గుడి తలుపులు మూసివేత..!

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన విసాల వెంకన్నస్వామి గుడి తలుపులు మూత పడబోతున్నాయి. చిల్కూర్ బాలాజీ దర్శనానికి ఇక కొన్ని గంటలే మిగిలి ఉంది. బుధవారం రాత్రి స్వామివారికి పవళంపు సేవ పూర్తయిన తరువాత.. ఆలయాన్ని మూసివేయనున్నారు అర్చకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వరుడి దర్శనానికి భక్తులను అనుమతించరు. ప్రాణాంతక కోవిడ్-19 కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు.

సోషల్ ఐసొలేషన్ ప్రొటోకాల్‌లో భాగంగా..

సోషల్ ఐసొలేషన్ ప్రొటోకాల్‌లో భాగంగా..

స్వామివారికి రోజువారీ పూజాదికాలు, ఇతర సేవలను యధాతథంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. భక్తులకు మాత్రం అనుమతి ఉండబోదని చెప్పారు. స్వామివారి సేవలన్నీ అర్చకుల సమక్షంలోనే నిర్వహిస్తామని, బయటి వారికి అనుమతించట్లేదని రంగరాజన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు సోషల్ ఐసొలేషన్ ప్రొటోకాల్‌లో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.

ఉగాదిన పునఃదర్శనం..

ఉగాదిన పునఃదర్శనం..

ఈ నెల 25వ తేదీన నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయనాన్ని తెరుస్తామని, భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఆ తరువాత కూడా ఆలయాన్ని తెరిచే ఉంచాలా? లేదా? అనే విషయాన్ని అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేలా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు.

Recommended Video

    Viswa Hindu Parishad Questions To AP Govt Over The New Appointments In Mansas trust
    రద్దీని నివారించడానికే..

    రద్దీని నివారించడానికే..

    చిల్కూర్ బాలాజీని దర్శించుకోవడానికి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. తెల్లవారు జాము నుంచీ స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతుంటారు. ప్రదక్షిణలు చేస్తుంటారు. ఒకేచోట వందలాది మంది భక్తులు చేరుకోవడాన్ని నివారించడానికి చిల్కూర్ బాలాజీ అర్చకులు గుడి తలుపులను మూసివేయనున్నారు. కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఇప్పటిదాకా పలు దఫాలుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. అరుదైన అపమర్జనా మంత్రాలను పఠించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+