హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు ఆరు రకాల వైద్య పరీక్షలు -సీఎం వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ -తిరిగి ఫామ్‌హౌజ్‌కు..

|
Google Oneindia TeluguNews

కొవిడ్ బారిన పడి, దాదాపు కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి వచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం తగ్గినప్పటికీ జాత్రత్త చర్యల్లో భాగంగా సీఎంకు కీలక పరీక్షలు నిర్వహించారు. కేసిఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది.

సీఎం కేసీఆర్ కు 40 నిమిషాల పాటు ఆరు రకాల పరీక్షలు చేశారు. 1)సి రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్ పీ) డైమర్, 2)ఐఎల్ 6, 3)లివర్ ఫంక్షన్ టెస్ట్, 4)కంప్లీట్ బ్లాక్ పిక్చర్, 5)సిటీ స్కాన్‌, 6)చెస్ట్ ఎక్స్ రే కూడా తీశారు. వివిధ పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ యశోదా ఆస్పత్రికి వచ్చిన సమయంలో వెంట తనయుడు కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉన్నారు.

మోదీకి దిమ్మతిరిగే షాక్: దొంగిలిస్తావో అడుక్కుంటావో.. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందే: ఢిల్లీ హైకోర్టుమోదీకి దిమ్మతిరిగే షాక్: దొంగిలిస్తావో అడుక్కుంటావో.. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ ఇవ్వాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

COVID-19: CM KCR undergos medical tests at Yashoda hospital, return to farm house

సీఎం కేసీఆర్‌కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ముందుగా అనుమానించిన విధంగా సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లేదని, ఆక్సీజన్ స్థాయులు కూడా బాగున్నాయని ఆయన చెప్పారు. టెస్టులకు సంబంధించిన ఇతర రిపోర్టులు గురువారం వస్తాయని ఎంవీ రావు పేర్కొన్నారు. కాగా,

జగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనాజగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనా

COVID-19: CM KCR undergos medical tests at Yashoda hospital, return to farm house

యశోదా ఆస్పత్రిలో దాదాపు 50 నిమిషాలు గడిపిన సీఎం కేసీఆర్.. టెస్టులు పూర్తయిన వెంటనే తిరిగి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. ఇంకా కొన్ని రోజుల పాటు అక్కడే హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కవిత ఆయన బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం.

English summary
Two days after testing positive for COVID-19, Telangana chief minister K Chandrasekhar Rao (KCR) on Wednesday was taken into Yashoda hospital, Somajiguda, for undergoing several medical tests. KCR had isolated himself at his farm house on the city’s outskirts after getting infected with the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X