హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోవిడ్ 19 ఎఫెక్ట్ ... కరోనా నుండి కాపాడమని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

|
Google Oneindia TeluguNews

కరోనా ఎన్నో మందులు ఉన్నాయని , హోమియోపతిలో , ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయని రకరకాల పుకార్లు వ్యాప్తి చెందుతున్నా ఇప్పటికీ నిర్దిష్టమైన మందు మాత్రం ఏ దేశం ప్రకటించలేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రాకుండా, వ్యాప్తి చెందకుండా ఎలాంటి మందులు లేకపోవటంతో ఆ దేవదేవుడే కాపాడతారని పూజలు చేస్తున్న తీరు తెలంగాణా రాష్ట్రంలో కనిపిస్తుంది.

 తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కలకలం

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కలకలం

నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా అందునా తెలంగాణా రాష్ట్రం కూడా చేరటంతో అందరూ భయపడుతున్నారు. కరోనా తమను కబళించి వేస్తుందని భయపడుతున్న తెలంగాణా ప్రజలు వైద్య శాఖాధికారులు అన్ని చర్యలు చేపడుతున్నామని, భయపడకండి అని చెప్పినప్పటికీ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇక ఇదే ఆసరాగా ఎక్కడ పడితే అక్కడ కరోనా వచ్చిందని వదంతులు ప్రజలకు ఊపిరాడనివ్వటం లేదు . ఇక దిక్కు తోచని స్థితిలో ప్రజలు దేవుళ్ళను కాపాడమని వేడుకుంటున్నారు .

ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా ఇండియాలో కరోనా

ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా ఇండియాలో కరోనా

నిన్నటి దాకా మనకు ఎఫెక్ట్ లేదులే అనుకున్న కరోనా మనకు ఇప్పుడు తన ప్రభావాన్ని చూపటం మొదలు పెట్టింది. కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌లోనూ పాగా వేసేసింది. ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా దేశంలోకి అడుగుపెట్టిన కరోనా ఇటాలియన్లు పర్యటించిన ప్రాంతాల్లో పలువురికి వైరస్‌ సోకింది. ఇక కరోనా వైరస్ మన ఉష్నోగ్రతల నేపధ్యంలో వ్యాప్తి చెందదు అని భావించినా ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. ఎప్పడు ఎవరి నుంచి కరోనా సోకుతుందేమోనని వణికిపోతున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక పూజలు

చిలుకూరు బాలాజీ ఆలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక పూజలు

ఇక ఈ క్రమంలోనే కరోనా భయంతో చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌-19 నుంచి రక్షించాలంటూ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని చుట్టేసిన ఈ భయానక , ప్రాణాంతక వైరస్‌ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆలయ పూజారులు.
ఇక ఈ కరోనా వైరస్ నుంచి దేవదేవుడు అయిన సర్వాంతర్యామి అయిన చిలుకూరు బాలాజీ ప్రజలను కాపాడతాడని ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ అన్నారు.

Recommended Video

Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu
దేవదేవుడి ఆశీస్సులు ఉంటాయన్న ప్రధాన అర్చకుడు

దేవదేవుడి ఆశీస్సులు ఉంటాయన్న ప్రధాన అర్చకుడు

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ మన దేశానికి వ్యాప్తి చెందకూడదని కూడా ఈ లాయంలో పూజలు నిర్వహించారు . ఇక రాకూడదు అని ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు చేసిన అర్చకులు తాజాగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని, ప్రబలకుండా స్వామి కాపాడాలని ప్రత్యేక పూజలు చేశారు. దేవుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ఎవరూ ఆందోళన చెందవద్దని రంగరాజన్ పేర్కొన్నారు.

English summary
Special pilgrimages were held at Chilukuru Balaji Temple for fear of corona. Priests performed special rituals to protect the deadly pandemic from Kovid-19. The temple priests said that the rituals were performed to protect the people from this horrendous and deadly virus that had engulfed the world.The chief priest of the temple, Rangarajan, said that God Chilukuru Balaji, will protect the people from this coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X