Hyderabad: ఇది కదా కావాల్సింది.. గీత దాటితే అంతే.. ఇద్దరు సీఐల సస్పెండ్..
హైదరాబాద్ మూడు కమిషనరేట్ పరిధిలోని కొత్త సీపీలు పనితీరులో తమైదన ముద్ర వేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కమిషనరేట్ల సీపీలను మార్చింది. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించారు. డ్యూటీలో హనేస్ట్ గా ఉంటారని వీరికి పేరు ఉంది.
కొత్త సీపీలు ఛార్జ్ తీసుకుని తమదైన శైలిలో పని చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న సీఐలు, ఎస్సైలను కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. కేపీహెచ్బీ సీఐ వెంకట్, ఆర్జీఐ సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కేపీహెచ్బీలో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు సీఐ వెంకట్ పై చర్యలు తీసుకున్నారు.

సదరు సీఐ భార్యాభర్తల వివాహంలో వివాదంలో జోక్యం చేసుకొని వ్యక్తిని చితకబాదాడు. ఒక కేసు విషయంలో సరిగా విచారణ చేయనందుకు ఆర్జీఐ సీఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసు విచాణను తప్పుదోవ పట్టించిన పంజాగుట్ట సీఐ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావుపై కఠిన చర్యలు తీసుకున్నారు.
మియాపూర్ ఎస్సై గిరీష్‌కుమార్‌ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో గరీష్ అనుచితంగా ప్రవర్తించినట్లు అభియోగం మోపారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్‌కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నాడు. అయితే బ్యూటీషియన్‌గా పని చేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసు విషయంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్సై దానిని సాల్వ్ చేసి సదరు మహిళకు డబ్బును రికవరీ చేయించిన తర్వాత కూడా సదరు మహిళకు నిత్యం ఫోన్ చేసినట్లు తేలింది. దీంతో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications