విద్యార్థినిపై కక్ష, కోపం, పగ.. ఓ టీచర్ వికృత చేష్టలు, షర్ట్ విప్పేసి, ప్యాంట్ విప్పమని..
వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్ల పెచ్చుమీరుతోంది. అవును కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తోన్నాయి. విశ్వనగరి భాగ్యనగరంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో అనిత అనే 15 ఏళ్ల బాలిక చదువుతోంది. ఇటీవల పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో ఆమె పిరియడ్‌లో ఉన్నారు. దీంతో పదే పదే బాత్రూం వెళ్లాల్సి వచ్చింది. దానిపై సదరు మాస్టర్‌గా అనుమానం కలిగింది. ఇంకేముంది దారుణంగా అవమానించారు.

పరీక్ష రాస్తుండగా..
సెప్టెంబర్ 23వ తేదీన బాలిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పరీక్ష రాస్తున్నారు. పరీక్ష మధ్యలో రెస్ట్ రూం వెళ్లాల్సి వచ్చింది. ఇదీ సాధారణమే.. కానీ దానిని కూడా కొందరు అనుమానంగా చూశారు. కొందరు అంటే టీచర్.. అనిత పదే పదే వెళ్లడంతో ఛీట్ చేస్తుందా అని భావించారు. స్టాఫ్ రూమ్‌కి పిలిచి ఆరా తీశారు. విషయం బాలికి చెప్పినా.. వాష్ రూమ్ వెళ్లి శానిటరీ ప్యాడ్ చూడాలని ఆయాకు ఆ టీచర్ చెప్పడం దారుణమైన ఘటన. అంతేకాదు కాపీ కొట్టిందనే అనుమానంతో ఆమె టాప్ కూడా విప్పించారు. ఫోన్ ఉందా అని చూశారు. ప్యాంట్ కూడా విప్పి చూసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించారు. అందులో ఫోన్ ఉందా అని అనుమానించారు. చివరికీ టీచర్ అరచి, వస్తువులు విసిరేసి భయభ్రాంతులకు గురిచేశారు.

పోలీసులకు కంప్లైంట్
ఘటన జరిగిన తెల్లవారి అనిత తల్లి పోలీసులను ఆశ్రయించారు. సదరు టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనిత పదో తరగతి చదువుతున్నారు. ఇప్పుడు నేరుగా తరగతులకు వెళ్తున్నారు.. కానీ అంతకుముందు ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు. కానీ తన కూతురును క్లాస్ టీచర్ దారుణంగా అవమాన పరిచారని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలాంటి ఘటన జరిగాయని అతని తల్లి సుధ గుర్తుచేశారు.

ఇదివరకు కూడా
గతంలో కూడా అదే టీచర్ ఈ విధంగా బిహెవ్ చేశారని పేర్కొన్నారు. తన తోటి విద్యార్థుల ముందు చాలా సార్లు తన కూతురిని దూషించారని వివరించారు. దుస్తులు, విధానం.. రకరకాలుగా తిట్టేవారని చెప్పారు. తాము మాల కులానికి చెందిన వారమని.. కులం పేరుతో కూడా దూషించారని వివరించారు. తన కూతురు రంగును బట్టి కులం ఉంటుందని.. అలా కులం పేరుతో దూషించారని వివరించారు.

మరచిపోలేం..
స్కూల్‌లో జరిగిన ఘటనలను తాము మరచిపోలేమని వివరించారు. సెయింట్ ఆండ్రూస్ స్కూల్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. పిల్లలు అందరినీ ఒకేలా చూడాలని.. లేదంటే వారు చాలా ఇబ్బందులు పడతారని వివరించారు. విద్యార్థుల ముందు డ్రెస్ గురించి చెప్పేవారని.. కురచ దుస్తులు ధరించాలని చెప్పేవారని వివరించారు. అంతేకాదు హెయిర్ స్టైల్, కళ్లు ఇతర అంశాలను కూడా చెప్పేవారని పేర్కొన్నారు.

అప్పుడు కూడా
ఇప్పుడే కాదు ఆన్ లైన్ క్లాస్ సమయంలో కూడా ఇలాగే ప్రవర్తించేవారు. నెట్ వర్క లేకున్నా.. అరిచేవారని తెలిపారు. డోర్ తీసినా.. తాను వచ్చిన ఇబ్బంది పడేతారని.. వీడియో ఆఫ్ చేస్తుందని.. సరిగా వినదని రకరకాల కారణాలు చెప్పేవారని సుధా వివరించారు. స్కూల్‌లో జరుగుతున్న విషయాలను ప్రిన్సిపల్ దృష్టికి సుధ తీసుకెళ్లారు. కానీ స్పందించకపోవడంతో.. కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications