డ్యామేజ్ కంట్రోల్: ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహాం.. త్వరలో ఏర్పాటు: కేటీఆర్

రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆందోళనలతో మిన్నంటింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేపట్టింది. ఇప్పటికే దళిత నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు అలా కాదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఏకంగా అంబేద్కర్ విగ్రహాం అంటూ హామీ ఇస్తుున్నారు. ఆయన హామీ వెనక ఏం ఉందో అందరికీ తెలిసిందే.

త్వరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 125 అడుగుల పొడవున్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందిరా నగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కి చెందిన స్థలంలో ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. HMDAకు చెందిన స్థలాలను వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతోనే పేదలకు సాయం చేసే దిశగా ఫంక్షన్ హాల్ ను కట్టించి పేదలకు సాయం చేయాలని అనుకుంటున్నామని మంత్రి అన్నారు.

damage control:ambedkar statue establish ntr gardens

ఇందిరా నగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీను గురువారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ వెయ్యి 78.5లక్షలు వెచ్చించి నాలుగు బ్లాకుల్లో దీనిని నిర్మించారు. రెండు బెడ్ రూంల స్కీంలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించింది జీహెచ్ఎంసీ. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మొహమూద్ అలీ, మేయర్ జీ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమ్ నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.

Recommended Video

    World’s Second Largest Statue Of Saint Ramanujacharya In Hyderabad By PM Modi | Oneindia Telugu

    అంతకుముందు భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. విపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసననగా తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకరం చేశారు. రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ కామెంట్స్ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని విమర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+