హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యశోదా ఆస్పత్రికి సీఎం కేసీఆర్ -మొన్ననే కరోనా పాజిటివ్ -జ్వరం తగ్గినా చెస్ట్ సీటీ కోసమంటూ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కరోనా మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆయనకు దగ్గు, జలుబుతోపాటు జ్వరం కూడా తగ్గింది. కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటి నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్ లో చికిత్స పొందుతోన్న సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే..

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

యశోదాకు సీఎం కేసీఆర్..

యశోదాకు సీఎం కేసీఆర్..

కొవిడ్ వ్యాధితో బాధపడుతోన్న సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్ సిటీ సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి వస్తున్నారన్న వార్త ప్రజల్ని ఒకింత షాక్ కు గురిచేసింది. సీఎం ఆరోగ్యంపై ఆందోళనలు పెరగనీయకుండా ఆయన ఆస్పత్రికి ఎందుకు వస్తున్నారనే క్లారిటీ కూడా వెలువడింది. లక్షణాలేవీ లేకుండానే కొవిడ్ వ్యాధికిలోనై, ప్రస్తుతం జ్వరం కూడా తగ్గినప్పటికీ, ఊపిరితిత్తుల్లో వైరస్ లోడు ఏమైనా ఉందా అని నిర్ధారించుకునేందుకు మాత్రమే కేసీఆర్ ఆస్పత్రికి వస్తున్నారు.

చెస్ట్ సీటీ స్కాన్ కోసమే..

చెస్ట్ సీటీ స్కాన్ కోసమే..

నిజానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ వెంట అత్యాధునిక సౌకర్యాలున్న అంబులెన్స్, ఎక్స్ రే, స్కానింగ్ వంటి యంత్రాలున్న మెడికల్ వాహనాలు నిత్యం ఉంటాయి. అదీగాక ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తోన్న యశోదా డాక్టర్ల బృందం కూడా ఓ అత్యాధునిక స్కానింగ్ వాహనాన్ని కూడా ఫామ్ హౌజ్ లో అందుబాటులో ఉంచింది. అయితే, అత్యధిక రిజల్యూషన్ ఉన్న యంత్రాలపై స్కానింగ్ చేస్తేనే ఊపిరితిత్తుల్లో వైరస్ ఏమైనా ఉందా, లేదా అనేది నూరుశాతం నిర్ధారణ అవుతుందని డాక్టర్లు సూచించడంతో ఆస్పత్రికి వచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా,

జగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనాజగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనా

Recommended Video

New Immune Escape Covid-19 Variant Found In West Bengal || Oneindia Telugu
మళ్లీ ఫామ్ హౌజ్‌కు వెళతారంటూ..

మళ్లీ ఫామ్ హౌజ్‌కు వెళతారంటూ..

కేవలం చెస్ట్ సీటీ స్కాన్ కోసమే సీఎం కేసీఆర్ యశోదా ఆస్పత్రికి వస్తున్నారని, అక్కడ ఆయన కోసం ప్రత్యేక గతి లాంటిదేదీ సిద్ధం చేయలేదని, టెస్టులు పూర్తయిన వెంటనే, ఫలితాన్ని బట్టి సీఎం కేసీఆర్ తిరిగి ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిపోతారని పలు మీడియా చానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని వైద్యులు, టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు.

English summary
telangana chief minister kcr, who is in an isolation after being tested positive for covid-19 likely to be shifted to yashoda hospital in hyderabad as per media reports. kcr currently taking treatment at his farm house may come to hospital for chest screening tests. says media report. officials yet to confirm on cm kcr hospital visit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X