ఆదాయ వనరుగానే ‘ధరణి’: కేసీఆర్ సర్కార్‌పై రాములమ్మ ఫైర్

టైం దొరికితే చాలు సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి ఒంటికాలిపై లేస్తారు. అధికార పార్టీ తప్పిదాలను దెప్పి పొడుస్తారు. ప్రభుత్వ లూప్ హోల్స్ బయటపెట్టడంలో ముందు ఉంటారు. సీఎం కేసీఆర్ 'ధరణి పోర్టల్‌'ను ఆదాయవనరుగా మార్చుకున్నారని ఆమె మండిపడ్డారు. ధరణితో సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. కానీ పోర్టల్‌ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.1000 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

కేసీఆర్ సర్కార్ ప్రతి దానికి రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటుందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ చార్జీల దగ్గర నుంచి అనుకోకుండా పడిన తప్పుల వరకు అంటూ ప్రస్తావించారు. భూ సమస్యలు అలాగే ఉండిపోతుండగా... ప్రభుత్వం రాబడి తగ్గకుండా చూసుకుంటోంది. ధరణి పోర్టల్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు రూ.1000 కోట్లు తన ఖాతాలో వేసుకుందని తెలిపారు.

dharani is government revenue source:vijayashanti

రెండేళ్లలో అన్ని రకాలుగా కలిపి ఈ ఆదాయం వచ్చిందన్నారు. అప్లికేషన్ చార్జీలు అని..రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వెళ్లేలా ఫీజులు ఉన్నాయని తెలిపారు. సక్సెషన్, మార్ట్​గేజ్, నాలా, పెండింగ్ మ్యూటేషన్లు, జీపీఏ, అగ్రిమెంట్ సేల్ కమ్​ జీపీఏ, లీజు వంటి ట్రాన్సా​క్షన్ల పేరుతో సొమ్ము చేసుకుంటోందని మండిపడ్డారు.

సేల్స్, గిఫ్ట్ డీడ్ ​వంటి రిజిస్ట్రేషన్ల చార్జీలతో రూ.3,120 కోట్ల ఆదాయం సమకూర్చుకుందని విజయశాంతి గుర్తుచేశారు. సేల్, గిఫ్ట్, మార్ట్​గేజ్​లతో ప్రభుత్వానికి వచ్చేది రెగ్యులర్ ఆదాయం వస్తుందన్నారు. ధరణి పోర్టల్ రావడంతో తలెత్తిన సమస్యలు, తప్పులతో వెనకేసుకున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వం రెగ్యులర్ ఆదాయంగానే చూస్తోందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+