హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్..!!
Secunderabad to Goa: సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. సురక్షితంగా గోవా వెళ్లి రావొచ్చు. రోడ్డు మార్గంలో వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా కేంద్రం చొరవ తీసుకుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న కొత్త రైలు సర్వీస్‌కు పచ్చజెండా ఊపింది.
సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడగామా మధ్య కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది డైరెక్ట్ ట్రైన్ సర్వీస్. ఈ రెండు నగరాల మధ్య నేరుగా రైలును నడిపించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది.

ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి వీ సోమన్న వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య రైలును నడిపించడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ- గోవా మధ్య రాకపోకలు మరింత విస్తృతమౌతాయని చెప్పారు.
ప్రస్తుతం ఈ రైలును ఎప్పుడు ప్రారంభిస్తారనేది వెల్లడించలేదు. దీనిపై రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు సాగించాల్సి ఉంది. సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య ఎక్కడెక్కడక? ఏ స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యాన్ని కల్పించాలి? ఈ రైలును ఏ రూపంలో ప్రయాణికుల ముందుకు తీసుకుని రావాలనే విషయం ఇంకా ఖరారు కాలేదు.
Delighted to announce that the direct train from Secunderabad to Vasco da Gama, Goa has been approved. This new service will enhance connectivity and convenience for passengers, with operational dates to be announced soon. pic.twitter.com/rYkTxEP7Zd
— V. Somanna (@VSOMANNA_BJP) July 6, 2024
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ రైలు సర్వీస్ అందుబాటులో లేదు. కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ద్వారా బెంగళూరులోని యలహంక వరకు వెళ్లి అక్కడి నుంచి మరో ఎక్స్‌ప్రెస్‌లో గోవాకు వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య డైరెక్ట్ రైలును నడిపించాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ ఉంది. ఇప్పుడది నెరవేరబోతోంది.












Click it and Unblock the Notifications