Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రేకింగ్: రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం.. మహిళా డాక్టర్ సజీవ దహనం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియాంక రెడ్డి అనే యువతిని దారుణంగా హత్య చేసి,దహనం చేశారు దుండగులు. వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డి మాదాపూర్లోని హాస్పిటల్ కు స్కూటీ పై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. ప్రియాంక స్వస్థలం కొల్లాపూర్‌ మండలం నర్సాయిపల్లి.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య.. ఆపై పెట్రోల్ పోసి దహనం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య.. ఆపై పెట్రోల్ పోసి దహనం

రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో డాక్టర్ ప్రియాంకా రెడ్డిని హతమార్చిన దుండగులు ఆపై ఆమె దేహాన్ని దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి లోని వంతెన వద్ద ప్రియాంక రెడ్డి దేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఈ సంఘట నమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి స్కూటీ నెంబర్ ఆధారంగా చనిపోయింది డాక్టర్ ప్రియాంకా రెడ్డి అని నిర్ధారణకు వచ్చారు.

మాదాపూర్ ఆస్పత్రికి వెళ్లి వస్తున్న క్రమంలో దారుణం ... రాత్రి సోదరితో మాట్లాడిన ప్రియాంకా రెడ్డి

మాదాపూర్ ఆస్పత్రికి వెళ్లి వస్తున్న క్రమంలో దారుణం ... రాత్రి సోదరితో మాట్లాడిన ప్రియాంకా రెడ్డి

నిన్న మాదాపూర్‌లోని హాస్పిటల్‌కు ప్రియాంక స్కూటీపై వెళ్లిన ప్రియాంక రెడ్డి రాత్రి 9.30 ప్రాంతంలో శంషాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో తన స్కూటీ పాడిందని సోదరి కి ఫోన్ చేశారు. తాను ఒంటరిగా ఉన్నానని తనకు భయంగా ఉందని, మాట్లాడాలని సోదరిని కోరారు. దాదాపు అరగంట పాటు సోదరి ప్రియాంక రెడ్డితో మాట్లాడుతూనే ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆ తర్వాత ఆమె ఫోన్ సిగ్నల్ కట్ అవడం, ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచాఫ్ అవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 మర్డర్ మిస్టరీ ... సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు ...

మర్డర్ మిస్టరీ ... సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు ...

ఈ రోజు ఉదయం ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని కాలుతుండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించటంతో క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సమీపంలో టోల్ ప్లాజా ఉండటంతో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రియాంకను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు అసలు ప్రియాంక రెడ్డి ని కలిసింది ఎవరు? ఆమెను తీసుకు వెళ్ళింది ఎవరు? ఎందుకు ఆమెను హతమార్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా వివరాలను తెలుసుకుని ప్రియాంక రెడ్డి హత్య కేసును చేదించే పనిలో పడ్డారు పోలీసులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+