telangana congress party revanth reddy trs cm kcr తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రైతు సమస్యలు politics
భ్రమలు కల్పించకండి..! రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖాస్త్రం..!!
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగ సమస్యలు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు ఎ. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అత్తసొమ్ముతో అల్లుడి సోకు అన్నట్టు రాష్ట్రంలో రైతన్న కష్టాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కొద్ది రోజులుగా సీఎం చంద్రశేఖర్ రావు పడుతోన్న తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కర్షకుడి కష్టాన్ని కూడా తమ ఘనతగా ప్రచారం చేసుకోవడానికి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

రైతు పరిస్థితి దయనీయంగా ఉంది.. ఆదుకోవాలని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ..
రైతు కష్టం, ప్రకృతి దయ వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చిందని, రైతు కళ్లలో ఆనందం వెల్లి విరియాల్సిన ఈ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆవేదన వ్యక్తం అవుతోందని, పంటపొలాల్లో రైతులు పడుతున్న కష్టాలు, నష్టాలు ప్రభుత్వం దృష్టికి ఎందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి తాను సీఎం కు రాసిని లేఖలో ప్రశ్నించారు. యాసంగి దిగుబడి బాగావచ్చిందని, ప్రతి కిలో ప్రభుత్వమే కొంటుందని కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. దీని కోసం 30 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారని అన్నారు.

రైతుకు భరోసా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం.. మండి పడ్డి మల్కాజ్ గిరి ఎంపీ..
ఇప్పుడు రైతులు పండించే పంటపొలాల్లో చూస్తే రైతులలో దుఖం ఉప్పొంగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ధాన్యాన్ని నడిరోడ్డుపై పోసి నిప్పుపెట్టుకుంటోన్న నిస్సహాయత కనిపిస్తోందని, పురుగుమందు డబ్బాలతో కొనుగోలు కేంద్రాల్లో నిరసన దృశ్యాలు కనిపిస్తున్నాయని, తమ కష్టాన్ని దళారీలు దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు అకాల వర్షంతో వచ్చిన అనుకోని నష్టం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ఆర్బాటపు ప్రకటనలతో సరిపెడుతోంది తప్ప వాస్తవ పరిస్థితులకనుగుణంగా రైతులకు భరోసా ఇవ్వలేక పోతోందని ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

అకాల వర్షాల వల్ల అనేక నష్టాలు.. నష్టపరిహారమివ్వాలంటున్న రేవంత్ రెడ్డి..
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. అకాల వర్షాలతో ఏప్రిల్ 14న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగిందని రేవంత్ తెలిపారు. ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో ఏప్రిల్ 24న కుమురం భీం, భవనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో వేల ఎకరాల వరిపంట, 613 ఎకరాల్లో మామిడికి నష్టం జరిగిందని చెప్పడమే కాకుండా మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో 1500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని, 150 ఎకరాల్లో మామిడికి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ఆధారాలతో వివరించే ప్రయత్నం చేసారు.

రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తాం.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేవంత్ రెడ్డి..
అంతే కాకుండా రైతు మరింత కష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలకు తక్షణం అధికార బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయించాలని, నష్ట పరిహారం చెల్లించాలని రేవంత్ సూచిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన లక్ష రూపాయల రుణమాఫీ తక్షణం అమలు చేయాలి. పిడుగుపాటుతో చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షల లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా మిర్చీ, పత్తి, పసుపు ఇతర వాణిజ్య పంటల కొనుగోలు, మద్ధతు ధరపై తక్షణం కార్యచరణ తీసుకోవాలని,
మామిడి, బత్తాయి, ఇతర ఫలాల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.