హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంటలు నీరు కట్.. సిటీలో ఏయే ప్రాంతాల్లో అంటే..

|
Google Oneindia TeluguNews

వేసవి.. ఆపై కరెంట్ కోతలు.. దీంతో జనం ఇబ్బందులు తప్పడం లేదు. అంటే తెలంగాణలో కరెంట్ కొరత అంతగా లేదు. ఏపీలో అయితే పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలో మంచినీరు బంద్ చేస్తారట. పలు ప్రాంతాలకు రేపు (సోమవారం) తాగునీటి సరఫరా బంద్ చేస్తారు. ఈ విషయాన్ని జల మండలి అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

గ్రేటర్ వాసులకు మంజీర వాటర్ సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వాటర్ బంద్ చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరా బంద్ కానున్న ప్రాంతాలను ప్రకటించాయి. బీరంగూడ, అమీన్పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం ఉన్నాయి.

drinking water supply stop in the hyderabad

లో ప్రెషర్ తో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలు ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. ఒకరోజు మంచినీరు సరఫరా ఉండనందున ప్రజలు సహకరించాలని కోరారు. నీటి వినియోగం చూసి వాడుకోవాలని.. 24 గంటలు నీరు అందుబాటులో ఉండవని చెప్పారు.

వేసవి కావడంతో నీటి అవసరం ఎక్కువగానే ఉంటుంది. అయితే బోర్ ఉన్నవారికి నో ప్రాబ్లమ్.. లేని వారు.. అంటే మంజీరా నీటి మీద ఆధారపడే వారు మాత్రం ఇబ్బంది పడక తప్పని పరిస్థితి నెలకొంది. అంటే వారు నీటిని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. తాగడానికి అప్పటి కోసం మినరల్ వాటర్ తీసుకున్నా.. ఇంటి అవసరాలకు మాత్రం నీరు కావాల్సిందే. సమీపంలో గల బోర్ నీరు.. లేదంటే.. పబ్లిక్ నీటి నల్లాల కోసం ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. సో 24 గంటలు మంచినీటి కొరత ఏర్పడనుంది.

English summary
drinking water supply stop in the hyderabad. monday morning 6am to tuesday morning 6am water not supplied
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X