బస్సులో పోకిరీ.. మహిళలను వేధించిన మందుబాబుకు జైలుశిక్ష
హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మందుబాబు ఆట కట్టించారు మహిళా కండక్టర్. ఫూటుగా తాగి బస్సెక్కిన సదరు పోకిరీ మందుబాబు చేష్టలతో మహిళా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మద్యం మత్తులో తూలుతూ అసభ్యంగా ప్రవర్తించిన సదరు మందుబాబుకు జైలుశిక్ష పడింది.

బాలాపూర్ కు చెందిన శ్రీనివాస్ సికింద్రాబాద్ కు వెళుతున్న మిధాని డిపోకు చెందిన సిటీ బస్సులో ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక లేడీ కండక్టర్ తో పాటు మహిళా ప్రయాణీకులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఫుల్లుగా మందు తాగిన అతగాడి అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన మహిళా కండక్టర్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఆపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. సెవెన్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచడంతో 3 రోజుల జైలుశిక్ష విధించారు న్యాయమూర్తి. అలాగే 100 రూపాయల జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications