హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ చదరంగం.. తమ్ముళ్లకు విజయం.. అన్నలకు ఓటమి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అన్న చెబితే తమ్ముడు వింటాడు. అన్న మార్గంలో తమ్ముడు నడుస్తాడు. ఇలా కుటుంబంలో అన్న పాత్ర కీలకం. అయితే ఎన్నికల వేళ వింత పరిస్థితి ఎదురైంది. కొన్నిచోట్ల తమ్ముళ్లు ముందు వరుసలో నిలిస్తే.. అన్నలు వెనుకబడ్డారు. రాజకీయ చదరంగంలో తమ్ముళ్లు గెలిస్తే, అన్నలు ఓడిపోయారు.

జడ్చర్ల సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లు రవి ఓడిపోయారు. ఆయన తమ్ముడు భట్టి విక్రమార్క మధిర నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మధిర నుంచి ఆయనకు వరుసగా మూడో గెలుపు ఇది. తాండూరు నుంచి టీఆర్ఎస్ మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.. ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై గెలుపొందారు.

elder brothers loss their seats, youngers won

నల్గొండలో హవా నడిపించే కోమటిరెడ్డి బ్రదర్స్ లో అన్నకు ఎదురుదెబ్బ తగిలింది. తమ్ముడేమో విజయకేతనం ఎగురవేశారు. నల్లగొండ నుంచి పోటీచేసిన వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించారు.

elder brothers loss their seats, youngers won

English summary
Younger brothers won in the political chess, at the same time elders lost their seats. Patnam Mahender Reddy, who worked as a TRS minister from Tandoor, was defeated. His younger brother Patnam Narender Reddy won from Kondangal on Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X