ఆర్టీసీలోకి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు..?: ఎండీ సజ్జనార్

ఆర్టీసీలో పలు మార్పులను తీసుకు వచ్చారు సజ్జనార్.. ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి ఏదో కొత్త పనులు చేపడుతున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ప్రోత్సహిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన ఆర్టీసీలో ప్రయాణికులను చేరవేయడం సామాజిక భాద్యతగా స్వీకరించామని వివరించారు.

ఆర్టీసీ బస్సు...మీది...మాది...మనందరిదీ అని గుర్తుచేశారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరించారు. ప్రతి రోజు 37 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ సేవలు అందిస్తున్నామని, ఇటీవలి కాలంలో 2250 బస్సులను పునరుద్దరించడంతో పాటు 850 కొత్త సర్వీసులను విడుదల చేశామన్నారు. కరోనా మహహ్మారి నుండి బయటి పడి ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందంని ఎండీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే మూడు వందల ఎలక్ట్రిక్ బస్సులు నడిపే ఆలోచన చేస్తున్నామన్నారు.

electric bus services will be available rtc md sajjanar said.

ఆర్టీసీ బస్సుల అలైటింగ్ పాయింట్ల వద్ద ప్రైవేటు క్యాబ్ లను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ఛార్టీలు పెంపు నిర్ణయం ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉందని, త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నారు. సామాన్య ప్రయాణికుడిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏ సంస్థ మనుగడ అయినా సిబ్బంది పనితీరుపై ఆధారపడి ఉంటుందని, ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం ప్రత్యేక నిర్ణయాలు చేపట్టామన్నారు.

ఏ సమస్య అయినా సరే ఇట్టే పరిష్కరిచ్చేస్తున్నారు సజ్జనార్. ఇష్యూను ట్విట్టర్‌లో లేవనెత్తితే చాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఈ సారి ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని చెప్పారు. దీంతో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు మింగుడు పడటం లేదు. కోడికి టికెట్ కొట్టడం, చిరు వ్యాపారిని బొప్పాయి పండు ఇవ్వాలని డ్రైవర్ కోరడం.. ఆర్టీసీ ప్రతిష్టను కాస్త మసక బారిస్తున్నాయి. దీనిపై సజ్జనార్ ఇప్పటివరకు స్పందించలేదు. చర్యలు తీసుకుంటే.. ఆర్టీసీకి బాగుండేది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+