ఇక కేసీఆర్‌కు మూడింది.. ఎవరూ కాపాడలేరు: ఈటల రాజేంధర్
సీఎం కేసీఆర్‌పై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అని చెప్పారు.. కేసీఆర్‌ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని ఈటల రాజేందర్ వివరించారు. త్వరలో ఊహకు అందని స్థాయిలో చేరికలు ఉంటాయని చెప్పారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా తనకు మంచి మిత్రుడని వివరించారు. హుజూరాబాద్ ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోటితో పీకే వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పారు.

గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఇస్తోన్న ఆహారంలో వాన పాములు, బొద్దింకలు వస్తున్నాయని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులు చెల్లించకపోవడం వల్లే వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని చెప్పారు. మంత్రులు స్వతంత్రంగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకు కొన్ని స్కూళ్లలో పుస్తకాలు ఇవ్వలేదని చెప్పారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అని చెప్పారు. హుజూరాబాద్ లో తన గెలుపును రాజగోపాల్ రెడ్డి కోరుకున్నారని గుర్తుచేశారు త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని ఈటల రాజేందర్ అన్నారు.












Click it and Unblock the Notifications