హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌కు అంత లేదు.. ఈటల లేదా హరీశ్ మాత్రమే, సీఎం పదవీపై కొండా..

|
Google Oneindia TeluguNews

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లబోనని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించినా.. ఆ పార్టీలోకి రానని తెలియజేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాతి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూనే.. ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు.

Recommended Video

Land Grabbing Issue: లక్షల ఎకరాలు కబ్జా.. KCR,TRS పై Sampath Kumar ఘాటు విమర్శలు..
కేటీఆర్‌కు అంత లేదు..

కేటీఆర్‌కు అంత లేదు..


తెలంగాణ సీఎం అయ్యే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. సీఎం అయ్యే అర్హత ఈటల రాజేందర్, హరీష్‌రావుకు మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు కాకుంటే పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని అంటూనే.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కేటీఆర్ మంచి వ్యక్తేనని, అయితే సీఎం పదవీకి మాత్రం ఆయన సూటబూల్ కాదన్నారు.

శత్రువులు లేరు..

శత్రువులు లేరు..


కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు లేరని, అందరూ మిత్రులేనని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే పార్టీ రాష్ట్రంలో బలహీన పడిందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేదని, అందుకే బయటకు వచ్చానని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇం చార్జ్ మానిక్కం ఠాకూర్, ఉత్తమ కుమార్ రెడ్డికి వివరించానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.

రేవంత్‌కు పగ్గాలు అప్పగించినా..

రేవంత్‌కు పగ్గాలు అప్పగించినా..

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినా తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లబోనని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందన్నారు. ఇంతో అంతో ఉందంటే తెలంగాణలోనే ఉందన్నారు. పంజాబ్, హర్యానా, అసోంలో కాస్త కాంగ్రెస్ ప్రభావం ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడిందన్నారు. తెలంగాణలో రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇచ్చినా.. ఆయన పార్టీని పైకి తీసుకురాలేరన్నారు. ఎందుకంటే అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని విమర్శించారు.

ఆగదు ఈ పోరాటం

ఆగదు ఈ పోరాటం

నీళ్లు, నిధులు, నియామకాలకోసం కొట్లాడతామన్నారు. సీఎం కేసీఆర్ మంచి దారిలో నడిస్తే ఆయనకే తాను మద్దతు ఇస్తానన్నారు. ముఖ్యమంత్రి మంచివాళ్లను దూరం చేసుకుంటున్నారని, ద్రోహులను దగ్గర చేర్చుకుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ కామెంట్స్ ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించడంపైనే అని అర్థమవుతోంది.

English summary
etela rajender, harish rao will eligible for chief minister post ex mp konda vishweshwar reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X