మైలాన్ పరిశ్రమలో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో వేర్‌హౌస్ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మృతి చెందారు.
పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళం వాసి లోకేశ్వరరావు(38), కార్మికులు బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా(40), బీహార్ వాసి రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటల ఆర్పే ప్రయత్నం చేశాయి. ఘటన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఐడీఏ బొల్లారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications