షాకింగ్: మంటల్లో పంజాగుట్ట ఫ్లైఓవర్ పిల్లర్ -దట్టంగా పొగలు, వాహనదారులు బెంబేలు -అసలేం జరిగిందంటే

జంట నగరాల్లో జనం రాకపోకలకు సంబంధించి అత్యంత కీలకమైన కూడలి పంజాగుట్టలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ పిల్లర్లకు ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి..

నాలుగు రోడ్ల కూడలిగా, నిత్యం రద్దీగా ఉంటూ, గ్యాప్ లేకుండా వాహనాలు తిరిగే పంజాగుట్ట ఫ్లైఓవర్ పై మంటలు, పొగలు వ్యాపించడంతో వాహనదారులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందే కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

fire accident under panjagutta flyover in hyderabad, traffic stopped a for while

పొగ కారణంగా ఆ సమయంలో అక్కడున్నవాళ్లు, చుట్టుపక్కల కార్యాలయాలు, దుకాణసముదాయాల్లోని వారిలో కొందరు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదం లేదని నిర్ధారించుకుని, ట్రాఫిక్ ను పునరుద్ధరించేలా అడుగులేస్తున్నారు. కాగా..

fire accident under panjagutta flyover in hyderabad, traffic stopped a for while

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సబంవించినట్లు ప్రాధమికంగా అంచనావేశారు. ఫ్లైఓవర్ పిల్లరకు ఏర్పాటు చేసిన డెకరేషన్ వస్తువులకు నిప్పు అంటుకోవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్టలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా కలవరపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+