హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి కరోనా టీకా ఈటల రాజేందర్‌కే.. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్..

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలుత ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ కూడా నిర్వహించారు. దేశంలో రూపొందించిన కోవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇప్ప‌టికే అనుమ‌తి ల‌భించిన సంగతి తెలిసిందే. ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసే ప్ర‌క్రియ ప్రారంభ‌ కాబోతుంది.

మొదటి టీకాను ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద్ర తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ ప‌ట్ల భ‌రోసా క‌ల్పించేందుకే వైద్య శాఖ మంత్రి తొలి వ్యాక్సిన్‌ను స్వ‌చ్ఛందంగా తీసుకోనున్నారు. ఈ వ్యాక్సిన్ ముందుగా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ అయిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, పారా మెడిక‌ల్ స్టాప్, పోలీస్ సిబ్బందికి, మున్సిప‌ల్ సిబ్బందికి, పారిశుద్య కార్మికుల‌కు అందించనున్నారు.

first corona vaccine was given to health minister etela rajender

సామాన్య ప్ర‌జ‌లు టీకా తీసుకోవాలంటే కొవిడ్ పోర్టల్‌లో గానీ, యాప్‌లో గాని త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పేర్లు న‌మోదు చేయించుకున్న వారికి వ్యాక్సిన్ వేసే తేదీల‌ను నిర్వ‌హించి వారికి స‌మాచారం ఇస్తారు. ఇన్ఫో తీసుకున్న వారు వ్యాక్సిన్ కోసం సన్నద్ధంగా ఉండాలి. అయితే టీకా తీసుకున్న కొందరికీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ చనిపోవడం కలకలం రేపుతోంది. మిగతా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి.

English summary
first corona virus vaccine was given to telangana health minister etela rajender
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X