హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పలకడానికి కష్టంగానే కరోనా ఔషధాల పేర్లు: కేటీఆర్, శశిథరూర్ మధ్య ఆసక్తికర ట్వీట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడూ కొత్త కొత్త పదాలను పరిచేయం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు శశిథరూర్. ఇప్పుడు కరోనా మందుల పేర్లు కూడా కొత్తగా ఉండటంతో వాటిని ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్.. అందులో శశిథరూర్ పాత్ర ఏమైనా ఉందంటూ ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పొసాకోనాజోల్, క్రెసెంబా, టోసిల్‌జుమాబ్, రెమిడిసివిర్, లైపోసోమాల్, ఆంఫోటెరిసిన్, ఫ్లావీపిరవిర్, మోల్నూపిరవిల్, బరిసిటినిబ్.. ఇలా పలకడానికే కష్టంగా ఉండే పేర్లను ఔషధాలకు ఎందుకు పెట్టారో? సరదాగా అడుగుతున్నా? అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేగాక, ఈ పేర్లు పెట్టే విషయంలో శశిథరూర్ పాత్ర ఉండే ఉంటుందని సరదా వ్యాఖ్యానించారు.

Floccinaucinihilipilification: Tharoors latest tongue-twister in friendly banter with KTR

అయితే, కేటీఆర్ ట్వీట్‌పై శశిథరూర్ కూడా స్పందించారు. 'ఇందులో తప్పులేదు. అలాంటి అవసరం లేని వాటిలో మీరెందుకు తలమునకలవుతారు. నాకు వదిలేయండి. కరొనిల్, కరొజీరో, గోకరోనాగో అంటూ సంతోషంగా పిలుచుకుంటాను' అంటూనే.. Floccinaucinihilipilification అనే అక్షరాలతో కూడిన మరో కఠిన పదాన్ని పరిచయం చేశారు.

దీంతో నెటిజన్లు వారిద్దరి ట్వీట్లపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరి ట్వీట్లు ట్రెండ్‌లోకి వచ్చాయి. కాగా, Floccinaucinihilipilification అనేది ఇంగ్లీష్ భాషలో అతిపెద్ద పదాల్లో ఒకటి. దీనికి అవసరం లేని పని లేదా అలవాటు అనే అర్తం వస్తుంది.

Recommended Video

NSUI Leader Venkat తో ముఖాముఖి, మల్లారెడ్డి పై ఫైర్.. చూస్తూ ఊరుకోం!!

English summary
Congress leader Shashi Tharoor, known for his penchant for rarely used, difficult-to-pronounce English words, on Friday threw in another head scratcher – floccinaucinihilipilification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X