Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు..!

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతోన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని షావర్మా, మండి రెస్టారెంట్లలో సోదాలు చేసింది. హోటళ్లలో అపరిశుభ్ర పరిస్థితులను అధికారులు గుర్తించారు. శుక్రవారం అల్ మతమ్ అల్ హింద్ అరేబియా మండి, అల్ మతమ్ అల్ మదీనా మండి, అల్ ఖాసిమ్ ది మండి హౌస్, యూసుఫ్‌గూడలోని మహమ్మదీయ షావర్మాతో సహా అధిక రద్దీ ఉన్న రెస్టారెంట్‌లలో దాడులు చేసింది. అల్ మతమ్ అల్ హింద్ అరేబియా మండిలో పరిశుభ్రత ఉల్లంఘనలు బయట పడ్డాయి.

కిచెన్ ఏరియా అధ్వాన్నంగా ఉందని, ముడి పదార్థాలను కప్పకుండా వదిలేశారు. అల్ ఖాసిమ్ ది మండి హౌస్‌లో నేరుగా నేలపై కొన్ని ఆహార పదార్థాలను ఉంచినట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్ లో వ్యర్థ జలాలతో అపరిశుభ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఫ్లోరింగ్ చాలా జిడ్డుగా ఉందని.. నీరు నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. అల్ మతమ్ అల్ మదీనా మండి వద్ద కిచెన్ ప్రాంతం ఇరుకైనదిగా ఉంది. వెంటిలేషన్ సరిగా లేదని అధికారులు తెలిపారు.

Food safety officials inspected restaurants in Hyderabad

ఫుడ్ హ్యాండ్లర్లు గ్లౌజులు లేదా హెయిర్‌నెట్‌లు లేకుండా పనిచేస్తున్నారని, ఆహార భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టి అధికారులు చైతన్యపురి ప్రాంతంలోని రెండు ప్రముఖ రెస్టారెంట్‌లు, శిల్పి ఎలైట్ రెస్టారెంట్, బార్ అండ్ బహార్ బిర్యానీ కేఫ్‌లపై దాడులు చేశారు.శిల్పి ఎలైట్ రెస్టారెంట్ అండ్ బార్‌ FSSAI లైసెన్స్‌ను డిస్ ప్లే చేయలేదని గుర్తించారు. తనిఖీలో ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు లేవని పేర్కొన్నారు. వంటగది అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో ఉందని.. జిడ్డుగల పైకప్పులు, ఓపెన్ డ్రెయిన్లు, నిలిచిపోయిన ముగురు నీరు కనిపించినట్లు వివరించారు. కూరగాయల నిల్వ, రిఫ్రిజిరేటర్ ఉంచిన ప్రాంతాలలో బొద్దింకలును గుర్తించారు. అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నా.. కొన్ని హెటళ్లు, రెస్టారెంట్లు కనీస జాగ్రత్త తీసుకోవడం లేదు. అందుకే ప్రజలు బయట తక్కువగా తింటే మంచిదని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+